Robin Hood
Robin Hood : చాలా కాలం తర్వాత హీరో నితిన్(Hero Nithin) నేడు ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్, పాటలతో ఒక మోస్తారు బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి విడుదల తర్వాత యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యినప్పటికీ, స్టోరీ బాగా రొటీన్ గా అనిపించిందని, రవితేజ కిక్ సినిమాకు ఈ చిత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. ఇక డేవిడ్ వార్నర్ సన్నివేశాలకు కూడా రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఆయన సన్నివేశాలు ఇంకా ఉండుంటే బాగుండేది అని చూసిన ఆడియన్స్ చెప్తున్న అభిప్రాయం. ట్రైలర్ లో చివర్లో కనిపించిన డేవిడ్ వార్నర్, ప్రొమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. డేవిడ్ వార్నర్ అంశం తర్వాత ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలి అని ఆడియన్స్ కి అనిపించేలా చేసింది ‘అది దా సర్ప్రైజ్’ సాంగ్.
Also Read : ‘రాబిన్ హుడ్’ మూవీ ట్విట్టర్ టాక్..ఈ రేంజ్ అసలు ఊహించలేదుగా!
కేతిక శర్మ(Kethika Sharma) తో తీసిన ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాటలో ఉన్న హుక్ స్టెప్ బాగా వైరల్ అయ్యింది. ఈ హుక్ స్టెప్ తో ఇన్ స్టాగ్రామ్ లో నెటిజెన్స్ వేల సంఖ్యలో రీల్స్ కూడా చేసారు. యూత్ ఆడియన్స్ ఈ హుక్ స్టెప్ కి ఆకర్షితులు అయ్యుండొచ్చు. కానీ విశ్లేషకులు మాత్రం తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ ని అయితే అడ్డమైన బూతులు తిట్టారు. మహిళా కమీషన్ కూడా సీరియస్ అయ్యింది. వెంటనే ఆ హుక్ స్టెప్ ని సినిమా నుండి తొలగించాలి, చూసేందుకు చాలా అసభ్యంగా ఉందంటూ మేకర్స్ కి నోటీసులు జారీ చేసింది. దీంతో మేకర్స్ మహిళా కమీషన్ ఇచ్చిన నోటీసులను చాలా సీరియస్ గానే తీసుకున్నారు.
హుక్ స్టెప్ కనపడకుండా, జూమ్ చేసి వదిలేశారు. దీంతో ఆడియన్స్ హుక్ స్టెప్పుని తొలగించారంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసారు. మేము ఈ సినిమాకు వెళ్ళింది ఆ పాట కోసమని, అలాంటి పాటలో పాపులర్ అయిన హుక్ స్టెప్ ని తొలగించడం బాధాకరమని, మా డబ్బులు వృధా అయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు సినిమా విడుదలకు ముందు కేతిక శర్మ ఈ పాటకు సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేసింది. అయితే ఇప్పుడు ఆ రీల్స్ ని ఆమె తొలగించేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిని బట్టి మహిళా కమీషన్ నోటీసులను మూవీ టీం మొత్తం చాలా సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. బుక్ మై షో లో గంటకు కనీసం రెండు వేల టికెట్స్ కూడా అమ్ముడుపోవడం లేదంటే ఎంత పెద్ద ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు.
Also Read : రాబిన్ హుడ్ కి థియేటర్ల సమస్య వచ్చిందా..? ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు..?