https://oktelugu.com/

Robin Hood : ‘రాబిన్ హుడ్’ మూవీ ట్విట్టర్ టాక్..ఈ రేంజ్ అసలు ఊహించలేదుగా!

Robin Hood : సుమారుగా ఐదేళ్ల నుండి సరైన సక్సెస్ లేక, వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న హీరో నితిన్(Hero Nithin), తనతో భీష్మ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వెంకీ కుడుముల తో కలిసి 'రాబిన్ హుడ్'(Robin Hood Movie) అనే చిత్రం చేసాడు.

Written By: , Updated On : March 28, 2025 / 08:59 AM IST
Robin Hood

Robin Hood

Follow us on

Robin Hood : సుమారుగా ఐదేళ్ల నుండి సరైన సక్సెస్ లేక, వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న హీరో నితిన్(Hero Nithin), తనతో భీష్మ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వెంకీ కుడుముల తో కలిసి ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) అనే చిత్రం చేసాడు. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. వెంకీ కుడుముల దర్సకత్వం లో నితిన్ సినిమా అనగానే ఈ చిత్రంపై మొదట్లో అంచనాలు భారీగా ఉండేవి. కానీ ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటి బయటకి రావడం, అవి ఆశించిన స్థాయిలో లేకపోవడం తో ఆ అంచనాలు ఆవిరి అయ్యాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా జరిగాయి. నితిన్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి. కానీ ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో బుక్ మై షో లో కేవలం 9 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

Also Read : దయనీయంగా తయారైన ‘రాబిన్ హుడ్’ పరిస్థితి..పొరపాటు ఎక్కడ జరిగింది?

ఇకపోతే నేడు విడుదలైన ఈ సినిమాకు ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. కొంతమంది అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేసారు. మరికొంతమంది అయితే రొటీన్ సబ్జెక్టు, బలవంతపు కామెడీ, అసలు వర్కౌట్ అవ్వలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా భీష్మ ని చూసి చాలా అంచనాలు పెట్టుకున్నాం, ఆ అంచనాలను అందుకోలేదు కానీ, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, టైం పాస్ ఎంటర్టైనర్ అంటూ కామెంట్స్ చేసారు. ఓవరాల్ గా సరైన టాక్ మాత్రం తెలియడం లేదు. వచ్చిన ట్విట్టర్ రియాక్షన్స్ మొత్తం కలిపి చూస్తే ఇది ఒక యావరేజ్ రేంజ్ సినిమా అని అనుకోవచ్చు. నితిన్ గత చిత్రాలు ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాలకంటే బెటర్ సినిమా అని ఓవరాల్ గా వినిపిస్తున్న టాక్.

ఉగాది సీజన్ కి రంజాన్ కూడా తోడు అవ్వడంతో ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సోలో గా రిలీజ్ అయ్యుంటే కచ్చితంగా హిట్ కూడా అయ్యేదేమో, కానీ పక్కనే మ్యాడ్ స్క్వేర్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఉంది, ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది, ఆడియన్స్ కి మొదటి ఛాయస్ ఆ చిత్రమే అవ్వొచ్చు, ఆ సినిమాకు టికెట్స్ దొరకని వాళ్ళు ‘రాబిన్ హుడ్’ కి వెళ్లొచ్చు. పాపం నితిన్ కి బ్యాడ్ లక్ నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అయితే ఈ సినిమా యావరేజ్ రేంజ్ లో ఆడబోతుంది అని అనుకోవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికే ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Also Read : రాబిన్ హుడ్ కి థియేటర్ల సమస్య వచ్చిందా..? ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు..?