https://oktelugu.com/

Sukumar : సుకుమార్ ను ఫాలో అవుతున్న తన శిష్యులు…కారణం ఏంటంటే..?

Sukumar : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ముఖ్యంగా సుకుమార్ లాంటి దర్శకుడు తనదైన రీతి లో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే...

Written By: , Updated On : March 28, 2025 / 05:53 PM IST
Sukumar

Sukumar

Follow us on

Sukumar : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ముఖ్యంగా సుకుమార్ లాంటి దర్శకుడు తనదైన రీతి లో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… పాన్ ఇండియాలో సైతం సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సుకుమార్ (Sukumar) అప్పటినుంచి ఇప్పటివరకు వరుస విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తన సినిమాలకు భారీ గుర్తింపు ఉందని ప్రూవ్ చేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో చాలావరకు సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీకి మంచి గుర్తింపుని తీసుకొచ్చిన సినిమాలు కూడా చాలానే ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan) తో ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. గత సంవత్సరం అల్లు అర్జున్ తో చేసిన పుష్ప 2 (Pushpa 2) సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది…

Also Read : సుకుమార్ కోసం టైమ్ వేస్ట్ చేసుకున్న స్టార్ హీరో…

ఇక ప్రస్తుతం అతని శిష్యులు కూడా అతని బాటలోనే నడుస్తూ రా అండ్ రాస్టిక్ స్టోరీ ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది… సుకుమార్ రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలతో రగ్గుడ్ స్టోరీలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక అతని శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల సైతం నానితో దసర అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

రగ్గుడ్ స్టోరీ తో నాని మొదటిసారి మాస్ అవతారంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు…ఇక ప్రస్తుతం బుచ్చిబాబు సైతం రగ్గుడు కథతో రామ్ చరణ్ ని చూపిస్తూ పెద్ది అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో బుచ్చిబాబు మాస్ డైరెక్టర్ గా అవతారం ఎత్తడమే కాకుండా పాన్ ఇండియాను శాసించే దర్శకుడిగా కూడా మారబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.

సుకుమార్ ఎప్పుడైతే మాస్ సినిమాలు చేయడానికి పూనుకున్నాడో అతని శిష్యులు కూడా అతని లానే మంచి సినిమాలు మాస్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం కొంతమంది సినిమా మేధావులు సైతం సుకుమార్ శిష్యులు అతన్ని చూసి ఇన్స్పైర్ అయినట్టుగా ఉన్నారు. అందుకే అందరూ అలాంటి సినిమాలే చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేయడం విశేషం…

Also Read : సుకుమార్ మూవీలో విలన్ గా నటిస్తున్న షారుఖ్ ఖాన్..హీరో ఎవరు..?