Robin Hood
Robin Hood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాలను రిలీజ్ చేస్తున్న సందర్భంలో థియేటర్ల కొరత అనేది ఏర్పడుతూనే ఉంది. మరి ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చాలామంది సినిమా పెద్దలు ప్రయత్నం చేస్తున్నప్పటికి వాళ్ళకి సరైన ధియేటర్లు లేకపోవడం వల్లే కొన్ని సినిమాలకు అన్యాయం జరుగుతుందంటూ మరికొంతమంది సినిమా నిర్మాతలు సైతం వాపోతున్నారు. థియేటర్లు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉండడం వల్ల వాళ్లు తమకు నచ్చిన సినిమాలకు మాత్రమే ఆ థియేటర్లను కేటాయిస్తున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే మలయాళం నుంచి వస్తున్న ‘ఎల్ 2 ఎంపూరన్’ అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నితిన్ హీరోగా చేస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమా మాత్రం రేపు థియేటర్లోకి వస్తుంది. నిజానికి రాబిన్ హుడ్ సినిమాకి థియేటర్లో కొరత అనేది ఏర్పడుతుంది. ఎల్ 2 ఎంపూరన్ సినిమాను ఇక్కడ ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల నితిన్ సినిమా మీద కొంత వరకు ఎఫెక్ట్ అయితే పడుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో సినిమాకి మంచి ఆదరణ దక్కే అవకాశం అయితే ఉంది. తద్వారా మల్టీప్లెక్స్ ఓనర్లు ఆ సినిమాకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కేటాయిస్తున్నారు.
Also Read : ‘రాబిన్ హుడ్ ‘ ఫస్ట్ రివ్యూ…అదొక్కటే మైనస్ కానుందా..?
మరి రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే ఆ సినిమాకి మంచి బజ్ ఉన్నప్పటికి థియేటర్ల కొరత అయితే ఉంది. మరి మల్టీప్లెక్స్ ఓనర్లతో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి చర్చలు జరిపిన తర్వాత రాబిన్ హుడ్ సినిమాకి కొన్ని థియేటర్లను తీసుకోవాలని ఉద్దేశ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరగబోతున్నాయి అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో సినిమాని కనక రిలీజ్ చేసినట్లయితే ఏ సెంటర్ ప్రేక్షకులకు ఎక్కువ గా రీచ్ అవుతుంది.
వాళ్ళు మల్టీప్లెక్స్ లోనే సినిమాలు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బీ,సీ సెంటర్ ప్రేక్షకులు మాత్రమే సినిమాలను చూస్తూ ఉంటారు. వాళ్లు సినిమా ఎలా ఉన్నా కూడా ఆ సినిమాని కనీసం ఒకసారైనా చూడడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంటారు. కానీ మల్టీప్లెక్స్ లో ఉన్న ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయడానికి థియేటర్ కి వస్తూ ఉంటారు.
అలాగే రాబిన్ హుడ్ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి మల్టీప్లెక్స్ థియేటర్లు దక్కితే ఆ సినిమా ఏ సెంటర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుగుతుంది అనే ధోరణిలో సినిమా మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలిస్తోంది. ఈరోజు జరిగే మీటింగ్ తో ఈ మూవీకి ఎలాంటి థియేటర్లు కేటాయించబోతున్నారు థియేటర్ల సంఖ్య పెంచుతారా లేదా అనే విషయాలో మీద కూడా క్లారిటీ రానుంది…
Also Read : ఇవేమి బుకింగ్స్ సామీ..’రాబిన్ హుడ్’ నితిన్ కెరీర్ లోనే వరస్ట్!