Robin Hood : వరుస ఫ్లాప్స్ తర్వాత హీరో నితిన్(Hero Nithin) ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం ద్వారా నిన్న మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నితిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా నమ్మకం తో ఉండేవాడు. ఆయనలో ఉన్న ఆ నమ్మకాన్ని చూసి కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, నితిన్ కం బ్యాక్ మూవీ గా నిలుస్తుందని అనుకున్నారు అందరూ. ఆయన చెప్పిన రేంజ్ లో అయితే సినిమా లేదు కానీ, పర్వాలేదు, ఒకసారి కచ్చితంగా చూడొచ్చు, టైం పాస్ ఎంటర్టైనర్ అనిపించింది. కామెడీ కొన్ని సన్నివేశాల్లో బాగా వర్కౌట్ అయ్యింది. కానీ స్టోరీ వీక్ గా ఉండడం వల్ల డైరెక్టర్ కి స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కువ స్కోప్ దొరకలేదు. కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్టుగా అనిపించింది అంటూ నిన్న రివ్యూస్ వచ్చాయి.
Also Read : ‘రాబిన్ హుడ్’ మూవీ ట్విట్టర్ టాక్..ఈ రేంజ్ అసలు ఊహించలేదుగా!
ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే, నితిన్ గత చిత్రాలకు టాక్ తో సంబంధం లేకుండా, కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. కానీ ఈ చిత్రానికి ఆయన గత రెండు చిత్రాల ఫలితాల తాలూకు ప్రభావం చాలా గట్టిగా పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా జరిగాయి. ఇక బుక్ మై షో యాప్ లో మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 28 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. నితిన్ రేంజ్ కి ఇది చాలా అంటే చాలా తక్కువ అనొచ్చు. విశ్వక్ సేన్ లాంటి హీరోలకు ఇంతకంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
నితిన్ కెరీర్ లోనే ఇది వరస్ట్ ఓపెనింగ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి ఈ చిత్రం వేరే ఎప్పుడైనా రిలీజ్ అయ్యుంటే మంచి ఓపెనింగ్ దక్కేదని అంటున్నారు విశ్లేషకులు. ఎందులకంటే ఈ సినిమా విడుదలైన రోజునే ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం విడుదలైంది. యూత్ ఆడియన్స్ మొత్తం ఆ సినిమా వైపే మొగ్గు చూపించారు. ఆ ప్రభావం ‘రాబిన్ హుడ్’ పై చాలా బలంగానే పడింది. కానీ ఎక్కడా ఫ్లాప్ టాక్ అయితే లేదు, యావరేజ్ రేంజ్ లో ఉంది కాబట్టి క్లోజింగ్ లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈరోజు, రేపు, ఎల్లుండి కి కలిపి పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తుందని, క్లోజింగ్ లో 20 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : దయనీయంగా తయారైన ‘రాబిన్ హుడ్’ పరిస్థితి..పొరపాటు ఎక్కడ జరిగింది?