Myanmar Earthquake : భూకంపం వల్ల ప్రాణనష్టం కూడా విపరీతంగా జరిగింది. అయితే భూకంపం ఏర్పడిన కేంద్రం మధ్యబిమయన్మార్ ప్రాంతంలో ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మయన్మార్ లోని ‘సగాయింగ్ ఫాల్ట్ ” కు సమీపంలో భూకంప కేంద్రం ఉంది.. ఈ ప్రాంతంలో భూ ఫలకాలు కదులుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి భూఫలకాలు అనేవి ఎప్పటికీ కదులుతూనే ఉంటాయి. సగాయింగ్ ఫాల్ట్ ప్రాంతంలో భూ ఫలకాలు 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్ల వేగంతో జరుగుతున్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాస్తవానికి భూ ఫలకాల కదలికలు 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భూకంప తీవ్రత అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూ ఫలకాల కదలిక దీర్ఘకాలం సాగుతున్న నేపథ్యంలో.. వాటి అంచులు రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతోందని.. అందువల్లే భూకంపం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమి ఫలకాలపై ఒత్తిడి పెరగడంతో పగుళ్లు ఏర్పడుతున్నాయని.. భూకంప కేంద్రం లోతు తక్కువగా ఉన్న నేపథ్యంలో నష్టం అంత తీవ్రంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూపలకాలు వేగంగా ఘర్షణకు గురవుతుండడం వల్లే మయన్మార్ ప్రాంతంలో భూకంపాలు తరచుగా ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Also Read : మయన్మార్‌లో భారీ భూకంపం: 7.7 తీవ్రతతో ప్రకంపనలు.. థాయ్‌లాండ్‌లోనూ..!
ఎన్నిసార్లు భూకంపాలు ఏర్పడ్డాయంటే..
సగాయింగ్ ఫాల్ట్ వల్ల మయన్మార్ ప్రాంతంలో గతంలో అనేకసార్లు భూకంపాలు ఏర్పడ్డాయి. ప్రమాదకరమైన ప్రాంతంలో ఉన్న ఈ ఏరియాలో గత వంద సంవత్సరాల లో రిక్టర్ స్కేల్ పై ఆరు కంటే ఎక్కువ తీవ్రతతో 14 భూకంపాలు ఏర్పడ్డాయి. 1946లో చోటు చేసుకున్న భూకంపం 7.7 తీవ్రతతో వచ్చింది. 1956లో 7.1 తీవ్రతతో భూమి కనిపించింది. 1988లో షాన్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. 2004లో కోకో ద్వీపంలో వచ్చిన భూకంపం లో బలమైన పకంపనలు చోటు చేసుకున్నాయి. వందల మంది కన్నుమూశారు. 2011లో టార్లే ప్రాంతంలో వచ్చిన భూకంపం లో 151 మంది కన్నుమూశారు. 2016లో 6.9 తీవ్రత తో భూకంపం వచ్చింది. తాజాగా 7.7 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. భూ ఫలకాలు తరచుగా కదులుతున్న నేపథ్యంలో ఇక్కడ భూకంపాలు ఏర్పడుతున్నాయి. భూకంపం ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ నష్టం తీవ్రంగా ఉంటోంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవిస్తున్నది. అయితే మయన్మార్ ప్రాంతంలో ఇలా భూఫలకాలు ఎందుకు జరుగుతున్నాయనేది అర్థం కావడం లేదు.. ఇక్కడ ఏమైనా భూమి అంతర్గత పొరలకు హాని జరుగుతోందా? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు భూ అంతర్గత పొరలను ప్రభావితం చేస్తున్నాయా? అనే ప్రశ్నల దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. మయన్మార్ లో చోటు చేసుకున్న భూకంపం వల్ల నష్టం వందల కోట్లల్లో ఉంటుందని.. చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని గ్లోబల్ మీడియా ప్రసారం చేసిన కథనాల ద్వారా తెలుస్తోంది.
Also Read : ఈ భూమ్మీద అతిపెద్ద భూకంపాలు ఎక్కడ సంభవిస్తాయో తెలుసా ?