Property Tax : ఏపీ ప్రజలకు ప్రభుత్వం( AP government) బిగ్ ఆఫర్ ఇచ్చింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించే వారికి వడ్డీలు 50% రాయితీ ఇస్తామని ప్రకటించింది. బకాయిలను ఒకేసారి చెల్లించే వారికి ఇది వర్తింపజేసింది. ఆస్తి పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్నుల్లో వడ్డీ 100% రద్దు చేయాలని ఇప్పటికే డిమాండ్లు వచ్చాయి. ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ పై 50 శాతం తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ జీవో విడుదల చేసింది. మార్చి 31 లోగా బకాయిలను ఏక మొత్తంలో కట్టే వారికి ఈ అవకాశం కల్పించింది.
Also Read : త్వరలోనే ప్రభుత్వ ట్యాక్సీలు.. ఓలా, ఉబర్, ర్యాపిడో మూసుకోవాల్సిందే
ఆస్తి పన్ను( property tax) వసూళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఈనెల 30, 31 తేదీల్లో అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను వసూలు కౌంటర్లు పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. ఈ కౌంటర్లు రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. ఆది, సోమవారాల్లో కూడా కౌంటర్లు తెరిచి ఉంచాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తగు ఏర్పాటు చేయాలని పుర, నగరపాలక సంస్థల కమిషనర్లను పురపాలక శాఖ సంచాలకులు సంపత్ కుమార్ ఆదేశించారు.
* పేరుకుపోయిన బకాయిలు
గత కొంతకాలంగా ఆస్తిపన్నులకు సంబంధించి బకాయిలు పేరుకుపోయాయి. వీటి వసూళ్లకు సిబ్బంది ప్రత్యేక డ్రైవ్( special drive) నిర్వహించిన ఫలితం లేకపోయింది. అందుకే ఆస్తి పన్ను బకాయిలు ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అటు భవనాలు, ఖాళీ స్థలాలపై పాత బకాయిలపై వడ్డీని సైతం 50 శాతం వరకు మాఫీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేవలం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను మార్చి 31 లోపు ఒకేసారి చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే బకాయిలు చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్నులలో సర్దుబాటు చేస్తారు.
* భారీగా భారం
వాస్తవానికి పట్టణాల్లో( municipalities ) ఆస్తి, ఖాళీ స్థలాలపై పన్నులు సకాలంలో చెల్లించకపోతే రూ.100 కు రెండు రూపాయల వడ్డీ పడుతుంది. జనవరి నుంచి జూన్ నెలాఖరులోపు.. జూలై నుంచి డిసెంబరు నెలాఖరులోపు పన్ను చెల్లించాలి. గతంలో ప్రభుత్వం ఇంటి అద్దె వార్షిక విధానం నుంచి మూలధన విలువపై ఆస్తిపన్ను మదింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకే ఆస్తి పన్ను బాగా పెరిగిపోయింది. అందుకే పన్ను చెల్లించేవారు ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* రెండు రోజులపాటు కార్యాలయాలు
మరోవైపు రేపు, ఎల్లుండి సెలవు దినాలు. సోమవారం రంజాన్( Ramzan) కావడంతో సెలవు ఉంటుంది. కానీ ఈ రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పని దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ రెండు రోజులు కార్యాలయాలను ఉదయం 11:00 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పని చేయనున్నాయి.
Also Read : ఆస్తిపన్ను బకాయిదారులకు ఇదో సువర్ణావకాశం.. త్వరపడండి