https://oktelugu.com/

Robin Hood : దయనీయంగా తయారైన ‘రాబిన్ హుడ్’ పరిస్థితి..పొరపాటు ఎక్కడ జరిగింది?

Robin Hood : యంగ్ హీరోలలో టాక్ తో సంబంధం లేకుండా మినిమం గ్యారెంటీ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న హీరో నితిన్(Hero Nithin).

Written By: , Updated On : March 27, 2025 / 04:01 PM IST
Robin Hood

Robin Hood

Follow us on

Robin Hood : యంగ్ హీరోలలో టాక్ తో సంబంధం లేకుండా మినిమం గ్యారెంటీ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న హీరో నితిన్(Hero Nithin). ఆయన గత చిత్రాలు ఫుల్ రన్ లో పెద్దగా ఆడకపోయినా, ఓపెనింగ్స్ లో మాత్రం పర్వాలేదు అనిపించింది. కానీ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రానికి మాత్రం ఓపెనింగ్స్ దారుణంగా వచ్చేలా అనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఒక్క చోట కూడా ఈ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఆక్యుపెన్సీలు నమోదు అవ్వలేదు. ఫలితంగా బుక్ మై షో లో ఇప్పటి వరకు ట్రెండింగ్ కి నోచుకోలేదు ఈ సినిమా. నితిన్ కి గతంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక్క షో కూడా హౌస్ ఫుల్ అవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : రాబిన్ హుడ్ కి థియేటర్ల సమస్య వచ్చిందా..? ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు..?

‘పుష్ప 2’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుండి వస్తున్న చిత్రమిది. అంత పెద్ద హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా ఈ చిత్రానికి కనీస స్థాయి ఓపెనింగ్ ఉంటుందని అనుకున్నారు. పైగా ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన సినిమా ఇది, శ్రీలీల(Heroine Srileela) ఇందులో హీరోయిన్, ప్రొమోషన్స్ అయితే వాళ్లకు తోచిన విధంగా దంచి కొట్టేస్తున్నారు. అవన్నీ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం పై ప్రభావం చూపిస్తుందని అనుకున్నారు కానీ, అలాంటిదేమి జరగలేదు. ఈ చిత్రం లో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు, అదే విధంగా ‘అదిదా సర్ప్రైజ్’ పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ అంశాలు కూడా జనాల్లో ఈ సినిమాపై ఆసక్తికి క్రియేట్ చేయలేదు. ఇది నితిన్ కి, మూవీ టీం కి పెద్ద షాక్.

ఒక్క ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది. ప్రీమియర్ షోస్ కి దాదాపుగా 55 వేల డాలర్లు వచ్చాయట. ఇదేదో సినిమా మీద క్రేజ్ తో వచ్చిందేమో అని అనుకోకండి. అన్ని రకాల పాసులను ఎనేబుల్ చేస్తే ఈ మాతం వచ్చిందని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. ఏది ఏమైనా ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్ కాంబినేషన్ నుండి ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. నితిన్ పై గత సినిమాల ప్రభావం చాలా బలంగా పడిందని ఈ సినిమాతో అర్థం అవుతుంది. టాక్ వస్తే కచ్చితంగా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ టాక్ రాకపోతే మాత్రం నితిన్ కెరీర్ లోనే అత్యంత

Also Read : ‘రాబిన్ హుడ్ ‘ ఫస్ట్ రివ్యూ…అదొక్కటే మైనస్ కానుందా..?