Robin Hood : నితిన్(Hero Nithin) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) ఆయన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ప్రొమోషన్స్ లో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula) మాట్లాడిన మాటలను చూస్తే కచ్చితంగా వీళ్ళ కాబినేషన్ లో మరో భారీ హిట్ రాబోతుంది అని అందరూ అనుకున్నారు. సినిమా కూడా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఉంది కానీ, ఎందుకో ఆ పాజిటివ్ టాక్ జనాల్లోకి తీసుకెళ్లడం లో మూవీ టీం విఫలం అయ్యిందనే చెప్పాలి. పైగా ఈ సినిమా విడుదలైన రోజే యూత్ ఆడియన్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల అవ్వడం, ఈ చిత్రానికి కోలుకోలేని దెబ్బ అనే అనుకోవచ్చు. యూత్ ఆడియన్స్ అత్యధిక శాతం ‘మ్యాడ్ స్క్వేర్’ వైపే మొగ్గు చూపడంతో ‘రాబిన్ హుడ్’ టాక్ జనాల్లోకి వెళ్లలేకపోయింది.
Also Read : ‘రాబిన్ హుడ్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఎపిక్ డిజాస్టర్!
ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మీకు ఒక ఉదాహరణ చెప్పబోతున్నాము. ఓవర్సీస్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 8 లక్షల డాలర్లకు జరిగింది. కానీ విడుదల తర్వాత ఇప్పటి వరకు ఆ సినిమాకు వచ్చినది కేవలం రెండు లక్షల డాలర్లు మాత్రమే. అంటే దాదాపుగా 80 శాతం కి పైగా నష్టాలు వాటిల్లాయి అన్నమాట. వచ్చిన ఆ కాస్త గ్రాస్ వసూళ్లు కూడా ఫ్రీ పాస్ ని ఎనేబుల్ చేయడం వల్లనే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓపెనింగ్స్ దగ్గర నుండే ఈ సినిమా బయ్యర్స్ కి రక్త కన్నీరు పెట్టించింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 28 కోట్ల రూపాయలకు జరిగింది.
కానీ పది రోజులకు గాను కేవలం 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మీకో విషయం తెలుసా?, గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి అక్షరాలా 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రాబిన్ హుడ్’ చిత్రానికి పది రోజులకు కలిపి కూడా ఇంత వసూళ్లు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా పది రోజులకు వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే కేవలం 6 కోట్ల 80 లక్షల రూపాయిలు మాత్రమే. నిన్నటితో ఈ చిత్రానికి క్లోజింగ్ కూడా వేసేసుకోవచ్చు. నితిన్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ అత్యంత దారుణంగా ఫ్లాప్ అయిన మూడు చిత్రాలను తీస్తే, అందులో కచ్చితంగా ‘రాబిన్ హుడ్’ చిత్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఇకనైనా నితిన్ నేటి తరం ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.
Also Read : ‘భీష్మ’ మొదటి రోజు వసూళ్లు 8 కోట్లు..కానీ ‘రాబిన్ హుడ్’ కి 5 రోజుల్లో వచ్చింది ఇంతేనా!