Arya 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కెరీర్ లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా, మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఆర్య 2′(Aarya 2 Re Release). ‘ఆర్య’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్(Director Sukumar) కాంబినేషన్ లో వచ్చిన చిత్రమిది. ఒక క్లాసిక్ కి సీక్వెల్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి, అలాంటిది ఈ రేంజ్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ పడితే ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉండుంటాయో మీరే ఊహించుకోండి. ఆ అంచనాలకు తగ్గట్టుగా అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అవ్వకపోవడం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ వద్దనే ఆగిపోయింది. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు అప్పట్లో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న సమయంలో విడుదల అవ్వడంతో తెలంగాణ ప్రాంతంలో కలెక్షన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి.
Also Read : ‘సలార్’ ని మించిన ‘ఆర్య 2’ రీ రిలీజ్..మొదటిరోజు ఎంత గ్రాస్ వచ్చిందంటే!
లేకపోతే ఈ చిత్రం ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకొని ఉండేదని ట్రేడ్ పండితుల అంచనా. ఇకపోతే ఈ చిత్రం పాటలు ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ ఆ పాటలకు వేసిన డ్యాన్స్ మరో ఎత్తు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాలో డ్యాన్స్ కోసం అల్లు అర్జున్ ప్రాణం పెట్టేసాడు అనే చెప్పాలి. ఈ చిత్రంలోని డ్యాన్స్ ద్వారానే అప్పట్లో ఆయన పాన్ ఇండియన్ రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. అలాంటి చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ మరోసారి రీ రిలీజ్ అయ్యింది. ఈమధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్ చిత్రాలకంటే, బ్లాక్ బస్టర్ ఆడియో ఉన్న సినిమాలు రీ రిలీజ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కాబట్టి ఆర్య 2 చిత్రం కూడా భారీ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి రీ రిలీజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ, కౌంటర్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నింది. మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ రీ రిలీజ్ కి సంబంధించిన థియేటర్స్ లో ఫ్యాన్స్ చేసిన హుంగామా వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఒక ప్రేమ జంట థియేటర్ లో పాటలు వచ్చినప్పుడు రొమాన్స్ చేసుకుంటూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ట్విట్టర్ లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనిని చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరు ఇలా తయారు అవుతున్నారేంటి అంటూ కామెంట్స్ చేసారు. అదే విధంగా కొన్ని థియేటర్స్ లో అయితే వనభోజనాలకు కూర్చున్నట్టుగా, స్క్రీన్ ముందు పద్మాసనాలు వేసుకొని కూర్చొని సినిమా చూస్తున్నారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.
Also Read : ‘ఆర్య 2’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ ఉందంటే!
Dance with stranger anta
Mamlni adgar yento @alluarjun #Arya2ReRelease #Arya2 pic.twitter.com/8z8FCWrAus
— Allu Babloo AADHF (@allubabloo) April 6, 2025