Robin Hood : యంగ్ హీరో నితిన్(Hero Nithin) టైం గత ఐదేళ్ల నుండి అసలు ఏమాత్రం బాగాలేదు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత నితిన్ కి సినిమాల విషయంలో అసలు కలిసిరావడం లేదు అన్నమాట. 2020 వ సంవత్సరం లో విడుదలైన ‘భీష్మ’ చిత్రం తర్వాత నితిన్ నాలుగు సినిమాలు చేస్తే, నాలుగు కూడా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ ఎంత ఫ్లాప్స్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. కానీ రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రానికి ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. ఇక లాంగ్ రన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ స్థాయి బిజినెస్ జరిగిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కనీసం ఆరు కోట్లు అయినా రావాలి.
Also Read : ‘భీష్మ’ మొదటి రోజు వసూళ్లు 8 కోట్లు..కానీ ‘రాబిన్ హుడ్’ కి 5 రోజుల్లో వచ్చింది ఇంతేనా!
కానీ ఆ ఆరు కోట్ల రూపాయిల షేర్ ఈ సినిమాకు మొదటి వారం మొత్తం కలిపి వచ్చింది. దీనిని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది చెప్పొచ్చు. సాధారణంగా నిర్మాతలు నా థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ని మొత్తం అమ్మేసి చాలా సేఫ్ గా ఉంటారు. కానీ ఈ సినిమాకు నిర్మాతకు పెద్ద నష్టం జరిగింది. 35 కోట్ల రూపాయిల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, కేవలం ఆరు కోట్ల రూపాయిలు మాత్రమే థియేటర్స్ నుండి వచ్చాయి. అంటే 30 కోట్ల రూపాయిలకు పైగానే నష్టాలు వచ్చాయట. చాలా కాలం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కి బలమైన దెబ్బ తగిలింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఒకసారి వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి మొదటి వారంలో కేవలం 2 కోట్ల 26 లక్షల రూపాయిలు వచ్చాయట.
ఇంతకు ముందు నితిన్ కి ఈ వసూళ్లు నైజాం ప్రాంతం నుండి మొదటిరోజు వచ్చేవి. దీనిని బట్టి అప్పటికీ, ఇప్పటికీ నితిన్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో మీరే అర్థం చేసుకోండి. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి మొదటి వారంలో 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రాంతం నుండి రెండు కోట్ల 26 లక్షల రూపాయలు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి వారం లో ఈ చిత్రానికి 5 కోట్ల 23 లక్షల రూపాయిలు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 6 కోట్ల 43 లక్షల రూపాయిలు వచ్చాయి. నితిన్ భీష్మ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు ఇవి. మళ్ళీ నితిన్ ‘తమ్ముడు’ చిత్రంతో వచ్చే నెల మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అయినా ఆయనకు భారీ కం బ్యాక్ ని ఇస్తుందో లేదో చూడాలి.
Also Read : రాబిన్ హుడ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆల్ టైం డిజాస్టర్ అంటే ఇదే!