Bheeshma and Robin Hood : మన టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ కాంబినేషన్ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇదంతా ఒకప్పుడు,ఇప్పుడు మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, ఎంత పెద్ద కాంబినేషన్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నా, ప్రీ రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్ కచ్చితంగా యూత్ ఆడియన్స్ ని ఆకర్షించే విధంగా ఉండాలి. అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఇలాంటి ఉదాహరణలు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ విషయం లోనే మనం ఈమధ్య కాలం లో చూసాము. అలాంటిది మీడియం రేంజ్ హీరోలకు ఇలాంటి పరిస్థితులు వస్తే చిల్లర కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రావడం లేదు. అందుకు రీసెంట్ ఉదాహరణ నితిన్(Hero Nithin) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie). ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula). గతంలో ఆయన నితిన్ తో భీష్మ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసాడు.
Also Read : ‘రాబిన్ హుడ్’ మూవీ ట్విట్టర్ టాక్..ఈ రేంజ్ అసలు ఊహించలేదుగా!
‘భీష్మ’ చిత్రం నితిన్ కెరీర్ లో ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు ఇరగ కుమ్మేసిన సినిమా. ఈ చిత్రానికి మొదటి వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘రాబిన్ హుడ్’ చిత్రానికి 5 రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా..?, అక్షరాలా 6 కోట్ల 30 లక్షల రూపాయిలు. అది కూడా జీఎస్టీ కలిపితేనే. ఎంత దారుణమైన వసూళ్లు అనేది మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు భీష్మ రాబట్టిన వసూళ్లను, రాబిన్ హుడ్ 5 రోజులు దాటినా రాబట్టలేకపోయింది.
దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మేకర్స్ కచ్చితంగా ప్రమోషనల్ కంటెంట్ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలి. ఆ ప్రమోషనల్ కంటెంట్ ని బట్టే, ఆడియన్స్ విడుదలకు ముందు సినిమాకు వెళ్లాలా?, వద్దా? అనేది నిర్ణయించుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా, మహేష్ బాబు సినిమా అయినా, ప్రభాస్ సినిమా అయినా, ఎవరి సినిమా అయినా అంతే. ప్రమోషనల్ కంటెంట్ బాగుంటే ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు టాక్ కాస్త తేడా అయినా చూసేస్తున్నారు ఆడియన్స్. ‘రాబిన్ హుడ్’ చిత్రం ఆ విషయంలో ఫెయిల్ అవ్వడం వల్లే క్రేజీ కాంబినేషన్ అయ్యినప్పటికీ ఇలాంటి పరాభవం ని ఎదురుకోవాల్సి వచ్చింది. నితిన్ ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని బలంగా నమ్మాడు, పరిస్థితులు బెడిసికొట్టడంతో నితిన్ చాలా తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి అయ్యుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : రాబిన్ హుడ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆల్ టైం డిజాస్టర్ అంటే ఇదే!