Rithu Chowdary: జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి సోషల్ మీడియా సంచనాలు కొనసాగుతున్నాయి. అమ్మడు అందాల విందులో హద్దులు చెరిపేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. నెటిజన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ రాబడుతుంది. ఒకప్పటి సీరియల్ నటి జబర్దస్త్ కమెడియన్ గా మారింది రీతూ చౌదరి. మోడలింగ్ నుండి సీరియల్స్ లో అడుగుపెట్టింది. పలు సీరియల్స్ లో ఆమె కీలక రోల్స్ చేశారు. అయినా బ్రేక్ రాలేదు. దీంతో జబర్దస్త్ షోకి రావాలని నిర్ణయం తీసుకుంది.
జబర్దస్త్ షో ఆమెకు అనతి కాలంలో ఫేమ్ రాబట్టింది. హైపర్ ఆది టీమ్ తో పాటు పలువురి స్కిట్స్ లో రీతూ చౌదరి నటించింది. తనదమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది. కొన్నాళ్లుగా రీతూ చౌదరి జబర్దస్త్ లో కనిపించడం లేదు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీనుతో పాటు పలువురు స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ వీడారు. రీతూ కూడా గుడ్ బై చెప్పేసింది.
ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజా ఆమె డెనిమ్ షార్ట్ లో బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఆమెను చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. లైక్స్, కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. రీతూ చౌదరి హాట్ టెంప్టింగ్ లుక్ వైరల్ అవుతుంది. రీతూ చౌదరిని ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ వరకూ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా సెలెబ్స్ కి ఆదాయమార్గంగా మారింది. దీంతో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు స్కిన్ షో చేస్తున్నారు.
ఇటీవల రీతూ చౌదరి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి హఠాన్మరణం పొందాడు. ఓ ఇంటర్వ్యూలో తండ్రిని తలచుకుని రీతూ చౌదరి కన్నీరు పెట్టుకుంది. నాన్నమ్మ వర్ధంతి నిర్వహించాలని సొంతూరు వెళ్లగా, ఆ రోజు రాత్రి గుండెపోటుతో తండ్రి కన్నుముశాడని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. తన కారులోనే తండ్రి కన్నుమూసినట్లు చెప్పుకుని బాధపడింది.
View this post on Instagram