Salaar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఇక ఈయన ఇప్పుడు సలార్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.ఇక ఈ నెల 22 వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. అయితే ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమా మీద మరింత అంచనాల పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే అప్పుడెప్పుడో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడలో వచ్చిన ఉగ్రం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన రవి బసుర్ ఇంతకుముందు ఒకసారి సలార్ సినిమా ఉగ్రం సినిమాకి రీమేక్ గా తెరెకెక్కుతుంది అని తెలియజేశాడు. అంతలోనే సినిమా యూనిట్ స్పందిస్తూ ఇది ఉగ్రం కి రీమేక్ కాదు అంటూ అతని మాటల్ని ఖండించారు. అయినప్పటికీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం రవి బసుర్ చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకుని ఒక ఫ్రెండ్ కోసం మరొక ఫ్రెండ్ పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద సాగుతుంది. ఉగ్రం సినిమా కూడా ఇదే పాయింట్ తో తెరకెక్కింది. ఇక అందులో భాగంగానే సలార్ ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతునే కేజీఎఫ్ రేంజ్ లో భారీ గా సెటప్ చేసి జనాల మీదికి వదులుతున్నారు…
సినిమా అంటే ఇంత మాత్రం నిర్లక్ష్యం దేనికి అని చాలామంది అంటున్నారు.నిజానికి ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి ఒక మంచి స్టోరీ రాసుకొని దాన్ని తెరకెక్కించాలి గాని అలా కాకుండా ఆల్రెడీ కన్నడ లో అప్పుడెప్పుడో వచ్చిన ఒక సినిమాని ఇప్పుడు భారీ రేంజ్ లో తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ట్రేడ్ పండితులు ప్రశాంత్ నీల్ ని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రం కాన్సెప్ట్ ని భారీ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్నారు అనేది ట్రైలర్ చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైతే ఉగ్రం సినిమా చూశారో వాళ్ళకి ఈ విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
కానీ ఉగ్రం సినిమా చూడని వాళ్లకు మాత్రం ఈ సినిమా చాలా ఫ్రెష్ గానే, కొత్తగానే అనిపిస్తుంది. ఇక డైరెక్టర్లు అందరూ ప్రభాస్ తో ఎందుకిలాంటి సినిమాలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఇంతకు ముందు ఆది పురుషు సినిమాతో ఓం రావత్ కూడా ప్రభాస్ కి ఒక భారీ ప్లాప్ ఇచ్చాడు…ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అదే తరహా లో తీసిన సినిమాని మళ్లీ తీసి ప్రభాస్ కెరియర్ ని రిస్క్ లో పెడుతున్నాడు…