Renu Desai Viral Video: సినిమా ఇండస్ట్రీ లో కొన్ని ప్రేమ జంటలు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత డివోర్స్ తీసుకున్నారు. అందులో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ఒకరు…వీళ్ళిద్దరూ ‘బద్రి’ సినిమా చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడే వాళ్లకు పిల్లలైతే పుట్టారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు… మొత్తానికైతే ఫ్యామిలీలో వచ్చిన విభేదాల కారణంగా వీళ్ళిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి రేణు దేశాయ్ పూణేలో తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె తరచుగా మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతుంటుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రీసెంట్ గా కుక్కలను చంపడం మీద ఆమె చాలా అగ్రేసివ్ గా మాట్లాడింది.
Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?
దాంతో ఆమెలో విశ్వరూపాన్ని చూసిన జనాలందరు ఈమె ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఆమె ఒక వీడియోనైతే షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె స్వామి మాల వేసుకుని ఉన్నారు. ఇక ఆమె మాట్లాడుతూ నేను స్వామి మాలలో కాశీలో ఉన్నాను. ఎందుకని చాలామంది నాకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. ఒకడైతే ఒక్క రాత్రికి మీ రేటెంత అని కామెంట్ పెడుతున్నాడు.
నీ బతుకే సరిగ్గా లేదు నువ్వు నా రేటు గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్? ఎందుకని ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు..మెసేజ్ టైప్ చేసేటప్పుడు అయిన నీ ఆత్మసాక్షి అనేది అడ్డు రావడం లేదా? ఇలాంటి మెసేజ్ నేను ఎందుకు పెడుతున్నాను అంటూ నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదా? అంటూ ఆమె చాలా కోపంగా మాట్లాడారు.
ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక లైఫ్ ను లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు వచ్చినప్పటికి తన పిల్లల కెరియర్ దృష్ట్యా ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడోవ భార్య అయిన అన్నా లెజనోవా తో ఉంటున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉండడం విశేషం…ఇక ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవిని కొనసాగిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే వీళ్ళ కొడుకు అయిన అఖిరా నందన్ తొందరలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
దేవుని మాల మీద ఉన్న నన్ను నైట్కు రేటు ఎంత అడుగుతున్నారు..
నీకు తినే పరిస్థితి లేదు .. ఎలా అడుగుతారు అలా? – రేణు దేశాయ్#Renudesai pic.twitter.com/vkYivyhjNs
— greatandhra (@greatandhranews) February 28, 2026