Regina Cassandra: సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను సాధారణంగా బయటపెట్టరు. నోరు విప్పితే మీడియా పలు రకాల కోణాల్లో పెడర్థాలు తీస్తుందని భయపడతారు. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచడం ద్వారా వారి భద్రతకు ఎలాంటి ముప్పురాదనే ఆలోచనలో ఉంటారు. కాగా ఓ హీరోయిన్ ఓపెన్ గా పర్సనల్ విషయాలు షేర్ చేసింది. ఆమె ఎవరో కాదు. రెజీనా కాసాండ్రా. ఈ చెన్నై భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన శివ మనసులో శృతి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. సుబ్రమణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అడివి శేష్ హీరోగా నటించిన ఎవరు మూవీలో రెజీనా నెగిటివ్ రోల్ చేసింది. ఆ చిత్రం మంచి విజయం అందుకుంది.. రెజీనా నటించిన ఉత్సవం మూవీ సెప్టెంబర్ 13న విడుదలైంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో ఆమె పాల్గొన్నారు.
రెజీనా కాసాండ్రా తాజా ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేసింది. మీపై చాలాసార్లు ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అందుకు మీ సమాధానం ఏమిటని యాంకర్ అడగ్గా… అవును నేను గతంలో పలువురితో రిలేషన్ లో ఉన్న సంగతి నిజమే. చెప్పాలంటే నేను సీరియల్ డేటర్ ని. ఒకరితో రిలేషన్ ముగిశాక మరొకరితో సాగించేదాన్ని. ప్రస్తుతానికి కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఎవరితో రిలేషన్ లో లేను. నేను సింగిల్ గా లైఫ్ లాగిస్తున్నాను, అన్నారు.
సందీప్ కిషన్ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి కదా అని యాంకర్ అడిగాడు. సందీప్ కిషన్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం. గొడవలు పడతాం. మళ్ళీ కలిసి పోతాము. అంతే కానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, రెజీనా అన్నారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ ప్రస్తావన కూడా ఉంది. సాయి ధరమ్ తో ఎఫైర్ రూమర్స్ ని రెజీనా ఖండించింది. సాయి ధరమ్ చాలా కూల్ అండ్ సాఫ్ట్ అని చెప్పుకొచ్చింది.
అలాగే తన పేరు వెనకున్న లాజిక్ ఏమిటో బయటపెట్టింది. రెజీనా కాసాండ్రా తండ్రి ముస్లిం కాగా, తల్లి క్రిస్టియన్ అట. అనంతరం వారు విడిపోయారట. తండ్రితో ఉన్నన్నాళ్లు రెజీనా ముస్లిం గా పెరిగిందట. విడిపోయాక తల్లి తనను క్రిస్టియన్ గా పెంచిందట. తాను చదివిన ఓ నవలలో ఇష్టమైన క్యారెక్టర్ పేరు కాసాండ్రా కాగా… ఆ పేరును రెజీనాకు తగిలించుకుందట.
Web Title: Regina cassandra reveals shocking things
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com