https://oktelugu.com/

Jagapathi Babu: హీరోయిన్స్ తో షాపింగ్ లు, పార్టీలు… జగపతిబాబు దివాళా తీయడానికి అసలు కారణం ఇదా!

Jagapathi Babu: జగపతిబాబు జూదంలో డబ్బు పోగుట్టుకున్నారనే ప్రచారం ఉంది. కానీ తన ఆర్థిక సమస్యలకు జూదం ఒక్కటే కారణం కాదని జగపతిబాబు అన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 10, 2024 10:02 am
    Real reason for Jagapathi Babu bankruptcy

    Real reason for Jagapathi Babu bankruptcy

    Follow us on

    Jagapathi Babu: జగపతిబాబు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. టైర్ టు హీరోగా ఏళ్ల తరబడి రాణించాడు. అలాగే ఆయన తండ్రి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్. వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు తాను సంపాదించింది కూడా పోగొట్టుకున్నాడు జగపతిబాబు. ఒక దశలో ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. ఎన్నడూ చూడని కష్టాలు పడ్డారు. కాగా తన ఆర్థిక ఇబ్బందులకు కారణాలేంటో జగపతిబాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

    జగపతిబాబు జూదంలో డబ్బు పోగుట్టుకున్నారనే ప్రచారం ఉంది. కానీ తన ఆర్థిక సమస్యలకు జూదం ఒక్కటే కారణం కాదని జగపతిబాబు అన్నారు. తాను జూదం ఆడతానని ఒప్పుకున్న జగపతి బాబు, మహా అయితే జూదంలో రెండు కోట్లు పోగొట్టుకుని ఉంటాను అని అన్నారు. మరి ఇంత ఆస్తి ఎలా పోయిందని యాంకర్ ప్రశ్నించారు. అది సమాధానం చెప్పలేని ప్రశ్న అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. హీరోయిన్లకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల కూడా డబ్బు పోగొట్టుకున్నారని తెలిసింది అని యాంకర్ అడిగారు.

    Also Read: Rana Naidu Season 2: రానా నాయుడు సీజన్ 2 లో కొత్త వెంకటేష్ కనిపిస్తాడా..?

    జగపతిబాబు మాట్లాడుతూ .. హీరోయిన్లకు గిఫ్టులు ఇచ్చి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఆడవారిని అలా తక్కువ దృష్టితో చూడను. కానీ హీరోయిన్స్ ని కలిసినప్పుడు, వాళ్ళతో పార్టీలకు వెళ్లినప్పుడు ఖర్చుకు వెనుకాడను. బిల్ నేనే కడతాను. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా నా జేబులో డబ్బు ఖర్చు పెడతాను. నాకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్లు షాపింగ్ చేస్తే బిల్ పే చేసేవాడిని. నా ఫ్రెండ్స్ మగ వాళ్లకు కూడా నేను బిల్లులు కట్టాను.

    Also Read: Puri Jagannadh: పూరీ జగన్నాధ్ తర్వాత సినిమా మీద క్లారిటీ వచ్చేసిందా..?

    నిర్మాతలకు డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒకెత్తయితే నా దగ్గర డబ్బులు లేని సమయంలో అప్పు తెచ్చి ఇల్లు కట్టాను. వడ్డీల రూపంలోనే రూ. 20 కోట్ల వరకు పోయాయి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసేవాడిని. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగపతిబాబు ఇండియా వైడ్ పాపులర్ విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.