https://oktelugu.com/

Rana Naidu Season 2: రానా నాయుడు సీజన్ 2 లో కొత్త వెంకటేష్ కనిపిస్తాడా..?

వెంకటేష్ సినిమాలను చూడడానికి కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్లు గా తెలుస్తోంది. ఇక రానా నాయుడు కి సంభందించిన సీజన్ 2 కూడా తొందర్లోనే రిలీజ్ కాబోతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 10, 2024 / 09:32 AM IST

    Rana Naidu Season 2

    Follow us on

    Rana Naidu Season 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో వెంకటేష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన ఫ్యామిలీ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆయన సినిమాలకి ఫ్యామిలీ సపోర్ట్ పెద్దగా లభించడం లేదు. ముఖ్యంగా ఆయన గత సంవత్సరంలో ‘రానా నాయుడు’ అనే ఒక వెబ్ సీరీస్ చేశాడు.

    అయితే ఈ సిరీస్ లో వెంకటేష్ చాలా వల్గర్ గా బిహేవ్ చేస్తూ, చాలా బూతులు కూడా మాట్లాడుతాడు. దానివల్ల ఆయనకి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న ఇమేజ్ అయితే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మీరు ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారు అని వెంకటేష్ ని అడిగితే దానికి సమాధానం గా ఆయన ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ఈ పాత్రని చేశాను. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు అని ఆయన సమాధానం అయితే ఇచ్చాడు. అయినప్పటికీ వెంకటేష్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి ఒక సిరీస్ ను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు.

    కాబట్టి వాళ్లు వెంకటేష్ సినిమాలను చూడడానికి కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్లు గా తెలుస్తోంది. ఇక రానా నాయుడు కి సంభందించిన సీజన్ 2 కూడా తొందర్లోనే రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాలో కూడా వెంకటేష్ అలాంటి బూతు డైలాగ్స్ చెబుతూనే నటిస్తాడా అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత అది వెంకటేష్ కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనే విషయాలైతే తెలియాల్సి ఉంది.

    ఇక మొత్తానికైతే వెంకటేష్ ఈ శిరీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది… అలాగే ఈ సినిమా ఆయన ఫ్యూచర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయబోతుంది అనేది తెలియాల్సి ఉంది…