https://oktelugu.com/

Puri Jagannadh: పూరీ జగన్నాధ్ తర్వాత సినిమా మీద క్లారిటీ వచ్చేసిందా..?

పూరి జగన్నాథ్ రామ్ తో ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక తన తర్వాత ప్రాజెక్ట్ కోసం కొంతమంది హీరోలను లైన్ లో పెట్టాడు. ఇక అందులో మొదట నాగార్జున ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 10, 2024 / 09:35 AM IST
    Follow us on

    Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా తీసే విధానాన్ని మార్చేసిన దర్శకులలో రాంగోపాల్ వర్మ మొదటి స్థానంలో ఉంటే పూరి జగన్నాథ్ అతని తర్వాత స్థానంలో ఉంటాడు. పూరి కూడా వర్మ శిష్యుడే కాబట్టి ఆయన నుంచి నేర్చుకున్న మేకింగ్ స్టైల్ ను తన సినిమాలో చూపిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అవ్వడమే కాకుండా ఏ హీరో అయినా సరే వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా పూరి జగన్నాథ్ సినిమాలో నటించాలని తాపత్రయ పడుతూ ఉంటారు.

    ఇక అలాంటి పూరి జగన్నాథ్ రామ్ తో ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక తన తర్వాత ప్రాజెక్ట్ కోసం కొంతమంది హీరోలను లైన్ లో పెట్టాడు. ఇక అందులో మొదట నాగార్జున ఉన్నాడు. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో అయిన యశ్ ఉన్నాడు. అయితే నాగార్జున కోసం ఒక సపరేట్ స్టోరీని రాసుకున్న పూరి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో ఆ సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. లేకపోతే కన్నడ స్టార్ అయిన యశ్ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలని చూస్తున్నాడు.

    ఇక వీళ్లిద్దరిలో ఎవరు డేట్స్ ఇవ్వకపోయిన కూడా పూరి వాళ్ల కోసం వెయిట్ చేయకుండా తన కొడుకు అయిన ఆకాష్ పూరిని హీరోగా పెట్టి ఒక లవ్ స్టోరీని తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్టోరీతో పూరి ఇంతకుముందు చేసిన ఇడియట్ సినిమా ఎలాంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుందో ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ ని చేయబోతుంది అంటూ పూరి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    ఇక మొత్తానికైతే ఆయన ఎవరికోసం వెయిట్ చేయరు అనేది మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. తను ఒక కథ రాసుకున్నాడు అంటే ఆ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తె ఆయనతో సినిమా చేస్తాడు. లేదంటే ఇంకొక కథతో వేరే హీరోతో సినిమా చేస్తాడు. అంతే తప్ప ఆ ఒక్క హీరో కోసం ఎదురుచూసే పరిస్థితి అయితే పూరి జగన్నాథ్ కు ఇప్పటివరకు రాలేదు…