Anchor Sreemukhi- Ranveer Singh: యాంకర్ శ్రీముఖి ఓ స్టార్ హీరోని ముద్దుల్లో ముంచెత్తారు. పబ్లిక్ గా ఆయనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. శ్రీముఖి ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. సైమా అవార్డ్స్ వేడుక బెంగుళూరులో ఘనంగా ముగిసింది. తెలుగు విభాగంలో పుష్ప ఆరు అవార్డ్స్ తో సత్తా చాటింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా పూజా హెగ్డే అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. ఇక సైమా ఈవెంట్ కి ఆలీ, శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హాజరయ్యారు.

విజయ్ దేవరకొండకు యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ అవార్డును రణ్వీర్ సింగ్ చేతుల మీదుగా ప్రజెంట్ చేశారు. అవార్డు ప్రధానం అనంతరం రణ్వీర్ సింగ్ వేదిక పై నుండి క్రిందికి వెళ్లిపోతుంటే శ్రీముఖి ప్రత్యేకంగా ఆయన్ని పిలిచారు. ఆయన్ని హగ్ చేసుకోవాలని ఉందన్న కోరిక బయటపెట్టారు. శ్రీముఖి కోరికను మన్నించి రణ్వీర్ వెనక్కి వెళ్లి శ్రీముఖిని హగ్ చేసుకున్నారు. ఆయనకు శ్రీముఖి ముద్దులు ఇచ్చారు. అలాగే రణ్వీర్ సింగ్.. శ్రీముఖి రెండు చేతులపై ముద్దులు పెట్టారు.
రణ్వీర్ ప్రేమతో కూడిన చర్యకు శ్రీముఖి ముగ్దురాలైపోయింది. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి తన ఆనందం పంచుకుంది. సైమా వేదికపై అందరి ముందు జరిగిన ఈ రొమాంటిక్ సీన్ వార్తలకెక్కింది. రణ్వీర్ సింగ్ అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల రణ్వీర్ నగ్నంగా ఓ ఫోటో షూట్ చేశారు. ఒంటిపై నూలుపోగు లేకుండా కెమెరా ముందు ఫోజులిచ్చారు. ఈ ఫోటో షూట్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక శ్రీముఖికి రణ్వీర్ అంటే ఎంత క్రష్ ఉందో తాజా ఘటనతో బయటపడింది. ఉండబట్టలేక అడిగి మరి తన కోరిక తీర్చుకుంది. మరోవైపు స్టార్ యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతుంది. పలు బుల్లితెర షోస్ లో సందడి చేస్తుంది. పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్న శ్రీముఖి షోకి లక్ష రూపాయల పైనే తీసుకుంటున్నారట. అలాగే నటిగా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీముఖి సోలో హీరోయిన్ గా’ క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. తాజాగా శ్రీముఖి ‘టైమ్ టు పార్టీ’ అనే మూవీలో నటించారు.
View this post on Instagram