Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంటోంది. ఎప్పుడు కూడా తమకు తోచిందే చేయడం ప్రభుత్వానికి అలవాటే. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి అడగని వాటిని తీసుకురావడం సర్కారుకు అలవాటుగా మారింది. ఇప్పుడు దసరా సెలవుల గురించి కూడా ఓ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. 2022లో దసరా సెలవులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు పదిరోజులు ఇచ్చే సెలవులు ఈసారి పదహారు రోజులు వస్తుండటంతో సర్కారు సెలవులు తగ్గించాలని చూస్తోంది.

గతంలో భారీ వర్షాల కారణంగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు. ఇప్పుడు పదహారు రోజులంటే సిలబస్ పూర్తి కాకుండా పోతోందనే ఉద్దేశంతోనే సెలవులు తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిలబస్ పూర్తి కాకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో సెలవుతు తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. చిన్న తరగతులకు యథాతథంగా సెలవులు ఇస్తున్నా పెద్ద తరగతులకు మాత్రం తగ్గించే యోచన చేస్తున్నారు.
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు 16 రోజులు సెలవులు రానుండటంతో సిలబస్ పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతోనే ఈ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అధిక సెలవులతోనే వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా సర్కారు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. పెద్ద తరగతులకు వస్తున్న సిలబస్ సమస్యల కారణంగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సెలవులు తగ్గించి సిలబస్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సెలవులు తగ్గించే ఆలోచనపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

దీనిపై ప్రభుత్వ సూచన మేరకే విద్యార్థుల భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని సెలవులు తగ్గించడంతో ఉపాధ్యాయులు ఈ మేరకు స్కూళ్లు నడపాల్సిందే. చిన్న తరగతులకు సమస్యలు లేకున్నా పెద్ద తరగతులను నిర్వహించాలని చూస్తున్నారు. సిలబస్ పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు కూడా ఈ మేరకు పని చేయాలని ఆదేశాలు జారీ చేసేందుకు ముందుకు రావడం గమనార్హం. ఏదిఏమైనా దసరా సెలవులు ఈ సారి ఎక్కువ రోజులు రావడం చిన్న పిల్లలకు సంతోషంగా ఉన్నా పెద్దవారికి మాత్రం ఇబ్బందులు తెస్తున్నా పాఠశాలకు హాజరు కావాల్సిందే.