https://oktelugu.com/

Ranbir Kapoor: ఆ డైరక్టర్​కి కోపమొస్తే నన్ను కొట్టేవారు- రణబీర్​

Ranbir Kapoor: బాలీవుడ్​ స్టార్​ హీరో రణబీర్​ కపూర్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ఉత్తరాదితోపాటు తెలుగులోనూ ఈ హీరోకు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే పలు చిత్రాలతో అలరించిన ఈ కుర్ర హీరో.. ప్రస్తుతం పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే అన్ని భాషల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యేదంకు ప్రయత్నిస్తున్నాడు. కాగా, ఇప్పటికే షూటింగ్​ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సినీ నేపథ్యం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 09:45 AM IST
    Follow us on

    Ranbir Kapoor: బాలీవుడ్​ స్టార్​ హీరో రణబీర్​ కపూర్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు ఉత్తరాదితోపాటు తెలుగులోనూ ఈ హీరోకు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే పలు చిత్రాలతో అలరించిన ఈ కుర్ర హీరో.. ప్రస్తుతం పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే అన్ని భాషల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యేదంకు ప్రయత్నిస్తున్నాడు.

    కాగా, ఇప్పటికే షూటింగ్​ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సినీ నేపథ్యం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తన సొంత కాళ్ల మీద నిలబడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రణబీర్​. కెరీర్​ మొదట్లో స్టార్​ దర్శకుడు సంజయ్​లీలా బన్సాలీ వద్ద అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేసి.. దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకున్నారు.

    Ranbir Kapoor

    Also Read: ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !

    కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రణబీర్​.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బన్సాలీ వద్ద తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.

    రాజ్​ కపూర్​:ద మాస్టర్ ఎట్​ వర్క్​ అనే బుక్​ని లాంచ్​కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రణబీర్​ ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే నేటి దర్శకులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరం డైరెక్టర్లు కమర్షియల్ సినిమాలకు మొగ్గుచూపుతున్నారని ఎవరైనా అంటే నేను నమ్మనని అన్నారు. ఎంతో నిబ్దతతో వారు పని నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో తాను బన్సాలీ వద్ద బ్లాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో గంటల తరబడి మోకాళ్ల మీద కూర్చొనేవాడినని.. బన్సాలీకి కోపం వస్తే ఏడాపెడా తిట్టేవారని.. ఒక్కోసారి కొట్టేవారని చెప్పారు. అలా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. అలాంటివన్నీ భవష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చారు రణబీర్​.

    Also Read: వివాదాస్ప‌ద హీరోయిన్ నుంచి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు !