Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా… మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్, పాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ కు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలిఉండడంతో బన్నీ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది అని చెప్పాలి. మూవీ ట్రైలర్ చూసినవాళ్లంతా సినిమా పక్కా సూపర్‌హిట్ అంటూ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా… తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్నిథియేటర్లలో టిక్కెట్లు బుక్కయిపోయాయి.
Pushpa Movie
Also Read: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !
కాగా తాజాగా ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘పుష్ప విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఆ సినిమా విడుదల కోసం పిచ్చెక్కిపోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో. ట్రైలర్స్, పాటలు, విజువల్స్, నటన… అంతా మాస్. నెక్ట్స్ లెవెల్ తెలుగు సినిమా. అల్లు అర్జున్ అన్నకు, రష్మికకు, సుకుమార్ సర్ కు నా అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు విజయ్ చేసిన ట్వీట్ కు అల్లు అర్జున్ ‘మీ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్. మేము మీ గుండెల్ని గెలుస్తామని ఆశిస్తున్నాను. రెస్పాన్స్ వినేందుకు వేచి ఉన్నా… శుక్రవారం… తగ్గేదేలే’ అని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ఈ సినిమాను నేలమాస్ సినిమా అని చెప్పారు. పుష్ప రాజ్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో శుక్రవారం తెలియనుంది.
Thank you all the Love my brother 🖤 Hope we win your hearts . Waiting to hear the response… Friday … Thaggedele 🖤
— Allu Arjun (@alluarjun) December 15, 2021
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…