https://oktelugu.com/

Kiara Advani: ఆడీ కార్లకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ…

Kiara Advani: 2014లో వచ్చిన  ఫగ్లీ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ తర్వాత 2016లో విడుదల అయిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక భరత్ అనే నేను సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కియారా. అదే సంవత్సరం వచ్చిన లస్ట్ స్టోరీస్‌ వెబ్ సిరీస్ తో బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ అయిపోయింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 3:27 pm
    Follow us on

    Kiara Advani: 2014లో వచ్చిన  ఫగ్లీ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ తర్వాత 2016లో విడుదల అయిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక భరత్ అనే నేను సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కియారా. అదే సంవత్సరం వచ్చిన లస్ట్ స్టోరీస్‌ వెబ్ సిరీస్ తో బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన కబీర్ సింగ్, షేర్ షా సినిమాలతో సూపర్ ఐ‌టి అందుకున్న ఈ భామ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా ఆడీ ఇండియాకు మొదటి మహిళా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ నిలిచింది.

    kiara advani is the first female person for audi car brand ambassidor in india

    Also Read: ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !

    జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ ఒక మహిళా అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే మొదటిసారి. దీన్ని ఆడీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించింది. ‘పురోగతి, సృజనాత్మకత ఒకేచోట ఉండాలి. కియారా అలీ అద్వానీని ఆడీ ఎక్స్‌పీరియన్స్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. ఇంతకు ముందు ఈ బ్రాండ్‌కు ప్రమోషన్ చేసిన విరాట్ కోహ్లీ, రీగ్-జేన్‌ల సరసన కియారా కూడా చేరింది. ప్రస్తుతం కియారా అద్వానీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామ్ చరణ్, శంకర్‌ల సినిమాలో కూడా తనే హీరోయిన్. గతంలో వీరి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ అయినా సరే… సెంటిమెంట్‌ను కూడా పక్కనపెట్టి రామ్‌చరణ్ మళ్లీ కియారాకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో పాటు భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ తేరా, జగ్ జగ్ జీయో చిత్రాల్లో కూడా కియారా నటిస్తుంది. ఇప్పుడు లైనప్‌లో ఉండే సినిమాలు హిట్ అయితే కియారా జోరు మరిన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది.

    Also Read: హిట్ అయితే ఓకే.. లేదంటే అన్నీ సర్దుకోవాల్సిందే !