Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇటీవల కాలంలో ఫ్యాషన్వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. గతకొద్దికాలంగా ఆయన ఎప్పుడు బయట కనిపించినా.. సరికొత్త లుక్‌లో స్టైలిష్ మేక్ఓవర్తో కనిపిస్తూ.. హాట్‌టాపిక్‌గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
సౌత్ స్టార్ ఇండో వెస్ట్రన్ లుక్‌లో కనిపిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరిచారు చెర్రి. ఆలివ్ గ్రీన్ కుర్తాతో నల్ల ప్యాంటు ధరించి దేశీ, వెస్ట్రన్ లుక్‌లను మిక్స్ చేసి డిఫరెంట్‌గా కనిపించారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఫొటోగ్రాఫర్లకు చిరునవ్వుతో ఫోజులిచ్చి అక్కడనుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి.
Also Read: HariHara Veeramallu: ఫైనల్‌గా తిరిగి పట్టాలెక్కనున్న వీరమల్లు.. షెడ్యూల్ ఎప్పుడంటే?
ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శత్వంలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా దాన్ని పూర్తి చేసుకుని.. ప్రస్తుతం రెండో షెడ్యూల్లో అడుగుపెట్టింది. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. కాగా, ఈ సినిమాలో కియారా అద్వాని, జయరామ్ అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరోవైపు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌తో పాటు తారక్ కూడా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
Also Read: Kamal Haasan: కమల్‌హాసన్ విషయంలో శ్రుతి కీలక నిర్ణయం
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ramcharan new look with new fashion
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com