Ram Charan: రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రలపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో భీమ్ ఫర్ రామ్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో పోలీసు పాత్రతో పాటు విభిన్న క్యారెక్టర్లలో చెర్రి కనిపించనున్నట్లు హింట్ ఇచ్చాడు జక్కన్న. అయితే, ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన చెర్రీ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రాజమౌళితో పని చేయడం వల్ల కెరీర్లోనే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా చాలా నేర్చుకున్నానని అన్నారు. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్ర చేశానని.. అందులో కథ పరంగా తన పాత్ర మూడు సరికొత్త లుక్స్‌తో ఉండనున్నట్లు తెలిపారు. సాధారణంగానే రాజమౌళితో సినిమాలో ఏదైనా క్యారెక్టర్ చేయాలని అందరికీ ఉంటుంది. అలాంటిది మూడు క్యారెక్టర్లు చేసే అవకాశం దక్కింది. ఇంతకంటే.. ఇంకేం కావాలి.. అని చెప్పుకొచ్చారు చెర్రి.
కాగా ,ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 7న విడుదలకు సిద్ధమైంది.
మరోవైపు ఆచార్య సినిమాలోనూ నటించారు చెర్రి. ఇందులో సిద్ధ పాత్రలో కనువిందు చేయనున్నారు. దీంతో పాటు శంకర్ సినిమాలో కూడా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే, తాజాగా, కాస్త విశ్రాంతి కేసం షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి.. తన సోదరితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు చరమఅ్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.