Chandrababu: ముద్రగడ పద్మనాభం.. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి ఆయన. కాపు రిజర్వేషన్లకోసం దీర్ఘకాలం పోరాటం చేసిన వ్యక్తి. చంద్రబాబు హయాంలో ఎన్నో పోరాటాలు చేశారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మెల్లిమెల్లిగా ప్రజాపోరాటాలకు దూరం అవుతూ వచ్చారు. ప్రస్తుతం అన్ని రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటూ.. కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్న ముద్రగడ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ చేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి మళ్లీ ఆయన ప్రజల్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం తరువాత మళ్లీ ఈయనకు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాల్సిన కారణం ఏముంటుందని.. రాజకీయ నిపుణులు ఆలోచన చేస్తున్నారు.

కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ముద్రగడ.. ఇటీవలే కొంత యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపై మరోసారి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారా..? లేదా.. ఏపీలో ముందస్తు ఎన్నికలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో మళ్లీ.. ప్రజల్లోకి వస్తున్నారా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. ఇటీవలి కాలంలో ముద్రగడ ప్రజాసమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. తన లేఖలతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఏపీ ప్రజల సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో యేడాదిలో ఎన్నికలు రాబోతున్నాయన్న సమాచారంతో ఇప్పటినుంచే ప్రత్యక్ష రాజకీయాల ద్వారా.. ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారా అనే అనుమానాలు ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ముద్రగడ బహిరంగ లేఖ.. ఈసారి ఏం సంధించారంటే?
ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. మొదటి నుంచి ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా.. కేవలం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూ.. వస్తున్నారు. కాపు రిజర్వేషన్ల సమితిని స్థాపించి సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పోరాటం చేస్తూ.. వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఆయన ఏ పార్టీకి దగ్గర కానీ.. దూరం కానీ కాలేదు. టీడీపీ సర్కారు కాలంలో కాపు రిజర్వేషన్ల పోరాటంలో తన కుటుంబం అవమాన పాలైందని.. ముద్రగడ భావించారు. దీంతో ఆరు మాసాల క్రితం పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రజా పోరాటంలో పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇటీవల చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ.. లేఖరాయడం విశేషం సంతరించుకుంది. నాడు చంద్రబాబు కారణంగానే తన కుటుంబం అభాసు పాలైందని ముద్రగడం ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి లేఖద్వారా తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ.. ధాన్యం కొనుగోళ్లు.. ఇతర సమస్యలపై లేఖలు సందిస్తూ.. వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లోపు ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్న ముద్రగడ.. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తారా..? లేదా అధికార పార్టీకి వైసీపీకి తోడుగా ఉంటారా..? లేదా సింగిల్ గానే బరిలో నిలుస్తారా అన్నది చూడాలి మరీ..
Also Read: ఏపీ నిధుల దాహానికి కేంద్రం బిగ్ షాక్..