PM Narendra Modi : ఇటీవలే ముంబై లో వేవ్స్ సదస్సు ఎంత అట్టహాసంగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశంలోని ప్రముఖ నటీనటులంతా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ ముఖ్య అతిథి గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) హాజరయ్యాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సు లో మన టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రాజమౌళి, నాగార్జున తదితరులు హాజరయ్యారు. అదే విధంగా బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి లెజెండ్స్ వచ్చారు. ఈ ఈవెంట్ లో అక్షయ్ కుమార్, చిరంజీవి వంటి వారు ఫేస్ టు ఫేస్ చిట్ చాట్స్ కూడా చేసారు. ఇక సదస్సు ముగింపుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచ్చేసి సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. అందులో ఆయన #RRR మూవీ ప్రస్తావన కూడా తీసుకొని రావడం హైలైట్ గా నిల్చింది.
Also Read : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘రెట్రో’ వసూళ్లు..బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్న ‘హిట్ 3’
ఆయన మాట్లాడుతూ ‘మన భారత దేశం ఎంటర్టైన్మెంట్ రంగానికి ఒక హబ్ గా మారడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మన దేశ మోహోన్నత సంస్కృతి ని ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడం లో సినీ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకు ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడమే. రాబోయే రోజుల్లో మన ఇండియన్ సినిమా ప్రపంచం లోనే అగ్రగామి గా నిలుస్తుంది అనే నమ్మకం నాలో ఉంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దేశ నాయకుడే ఈ రేంజ్ లో #RRR మూవీ గురించి మాట్లాడుతుంటే ఎంతో గర్వం గా ఉందంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ప్రధాని #RRR గురించి మాట్లాడుతున్నప్పుడు రాజమౌళి వైపు కెమెరా ఫోకస్ పెట్టారు. నెటిజెన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.