
Ram Charan New Political Party: రామ్ చరణ్ తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఆయన స్థాపించిన అభ్యుదయ పార్టీ మీటింగుల్లో పాల్గొంటున్నారు. తెలంగాణాలో చార్మినార్ వేదికగా, ఏపీలో కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద సభలు ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ పొలిటికల్ పార్టీ ఎప్పుడు పెట్టారని ఆశ్చర్యపోకండి. నిజంగా కాదు, ఇదంతా ఆయన లేటెస్ట్ సినిమా కోసం. దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ తన 15వ చిత్రం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ షూట్ పబ్లిక్ లో జరుపుతుండగా స్టిల్స్, వీడియోలు బయటకు వస్తున్నాయి.
చార్మినార్ వద్ద ఒక పొలిటికల్ మీటింగ్ కి సంబంధించిన సన్నివేశం చిత్రీకరించారు. అలాగే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మరో పొలిటికల్ మీటింగ్ సీన్ షూట్ చేశారు. ఈ రెండు సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. పీరియాడిక్ ఎపిసోడ్లో ఆయన పొలిటికల్ లీడర్. అభ్యుదయ పార్టీ నేత. ఈ పాత్రకు హీరోయిన్ గా అంజలి నటిస్తున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన నిరాడంబరమైన రాజకీయ నాయకుడిగా ఆయన పాత్ర ఉండనుంది.
ఈ పాత్రకు సంబంధించిన చాలా ఫోటోలు లీకయ్యాయి. దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రంగా ఇది రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే సూచనలు కలవు. ఏక కాలంలో శంకర్ భారతీయుడు 2, ఆర్సీ 15 చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అందుకే చిత్రీకరణ కొంత ఆలస్యం అవుతుంది.

ఇక నెక్స్ట్ దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ మూవీ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఉప్పెన చిత్రంతో పరిశ్రమను ఆకర్షించిన బుచ్చిబాబు రెండో చిత్రమే రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బుచ్చిబాబుకి రామ్ చరణ్ అవకాశం ఇచ్చారు. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ తో ఆయన గ్లోబల్ ఫేమ్ అందుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్… ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన విషయం తెలిసిందే.
https://twitter.com/RamCharan15Film/status/1623934207809708033