
Bigg Boss Telugu Season 7: తెలుగు బుల్లితెర పై ఒక సంచలనం బిగ్ బాస్ రియాలిటీ షో..ప్రతీ ఏడాది ఈ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇప్పటికి ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో 5 సీజన్స్ ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి..కానీ ఆరవ సీజన్ మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.అందుకు కారణం కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ న్యాయబద్దం గా లేకపోవడమే.కంటెస్టెంట్స్ కూడా పెద్దగా పేరున్న వాళ్ళు కాకపోవడం ఈ షో ఫ్లాప్ అవ్వడానికి దోహదపడ్డాయి.
అయితే ఈసారి విన్నూతన ప్రయత్నం చేయబోతున్నారట.అదేమిటంటే ఈ ఏడాది ప్రసారం అవ్వబోతున్న సీజన్ కంటెస్టెంట్స్ మొత్తం జంటలే పాల్గొంటాయట.ఇందుకోసం 11 జంటలను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఇది వరకు ఇండియా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ చెయ్యలేదు..మొట్టమొదటిసారి మన తెలుగులోనే చెయ్యబోతున్నారు.
ఇప్పటికే ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ అమర్ డీప్ – తేజస్విని జంట ఈ సీజన్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకు ప్రసారమైన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ లో గత సీజన్లో భార్య భర్తలైన రోహిత్ – మెరీనా జంట పాల్గొన్నారు..అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్ – రితిక జంట పాల్గొన్నారు.

వీళ్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది, వరుణ్ సందేశ్ సీజన్ 3 కి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎలా నిలిచాడో, సీజన్ 6 లో రోహిత్ కూడా అలాగే నిలిచాడు.దీనిని బట్టీ జనాల్లో ఇలా భార్య భర్తలుగా వచ్చిన కంటెస్టెంట్స్ కి ఎక్కువ ఆదరణ లభిస్తుందని గమనించి ఇలా ప్లాన్ చేసారని తెలుస్తుంది..చూడాలి మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో అనేది.ఈ సీజన్ కి హోస్ట్ గా బాలయ్య లేదా రానా దగ్గుపాటి వ్యవహరిస్తారని సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ప్రచారం సాగుతుంది..దీని గురించి స్పష్టత రావాలి.