Ayodhya Ram Mandir: చిరంజీవి కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. టాలీవుడ్ నుండి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానం దక్కింది. చిరంజీవి ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి ఆహ్వానం లభించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు అయోధ్యకు రావాలంటూ ఆలయ కమిటీ ఆహ్వానించింది. చిరంజీవి కుటుంబంతో పాటు నేడు అయోధ్య వెళ్లారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకను స్వయంగా వీక్షించారు. చిరంజీవి, రామ్ చరణ్ లకు అడుగడునా ఘన స్వాగతం లభించింది.
అయోధ్య ఎయిర్ పోర్ట్ లో దిగగానే ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. శాలువాలు కప్పి గౌరవించారు. అనంతరం ఫోటోలు దిగారు. కాగా అయోధ్య మందిరంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖుల కోసం ఓ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన విఐపీ ల మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ చిరంజీవి, రామ్ చరణ్ లతో కాసేపు ముచ్చటించారు.
దీన్ని షూట్ చేస్తున్న నేషనల్ మీడియా కెమెరా మెన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన(చిరంజీవి) రామ్ చరణ్ తండ్రి అందుకే ఫ్రేమ్ లో పెట్టాను, అని అన్నారు.రామ్ చరణ్ తండ్రికి మించిన తనయుడు అయ్యాడని ఈ పరిణామం తెలియజేస్తుంది. నార్త్ ఇండియాలో ఆయన క్రేజ్ కి ఏది నిదర్శనం. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఫేమ్ ఎల్లలు దాటిన విషయం తెలిసిందే. హిందీలో కూడా ఆర్ ఆర్ ఆర్ మంచి విజయం సాధించింది.
ఈ క్రమంలో నార్త్ లో కూడా రామ్ చరణ్ కి అభిమానులు ఏర్పడ్డారు. అక్కడ నేషనల్ మీడియా అయోధ్యలో రామ్ చరణ్ ని ప్రత్యేకంగా కవర్ చేసింది. తండ్రి చిరంజీవి మెగాస్టార్ గా సౌత్ ఇండియాను షేక్ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ మొత్తం ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ఫ్యాన్స్ ని పలకరించనున్నాడు. తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు.
• @ANI Cameraman : “Ye Abhi RamCharan ki Pita hei isliye inko Frame Mei Rakha hua hei, #RamCharan ke Father Hei” @AlwaysRamCharan pic.twitter.com/sdt16LuFBu
— Raees (@RaeesHere_) January 22, 2024