Food Stall Saikumari: యూట్యూబ్ లో పాపులర్ అవుతున్న ఈమె ఎవరు? ఈమె బిజినెస్ లో ఉండే ట్రిక్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడకు చెందిన సాయికుమారి మొదట్లో మిషన్ పై బట్టలు కుట్టేవారు. అయితే ఆమె భర్తకు ఫుడ్ బిజినెస్ చేయడం అంటే ఇష్టం. అయితే లాక్ డౌన్ సమయంలో అనాథలకు ఆహారాన్ని అందించడానికి కొందరు ఆమెకు కాంట్రాక్టు ఇచ్చేవారు.

Written By: Neelambaram, Updated On : January 22, 2024 5:34 pm

Food Stall Saikumari

Follow us on

Food Stall Saikumari: సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇదే సమయంలో కొందరు ప్రతిభ కలిగిన వ్యక్తుల గురించి వీటి ద్వారా వెలుగులోకి వస్తున్నారు. మొన్న గంగవ్వ.. నిన్న కనుకవ్వ.. ఊళ్లో ఉండి ఎవరూ పట్టించుకోని వారు.. నేడు సెలబ్రెటీలుగా మారారు. అలాగే కొందరు టేస్టీ ఫుడ్ బిజినెస్ చేస్తూ పాపులర్ అయ్యారు. లేటేస్టుగా ఓ మహిళ చిన్న పాటి కొట్టు పెట్టుకొని ఆహారాన్ని అందిస్తూ వైరల్ గా మారారు. జీవితం నడవడానికి అందరిలాగే ఆమె కూడా తన భర్త సహాయంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ ఇటీవల యూట్యూబ్ లో ఎక్కడా చూసినా ఆమె గురించే చర్చ.. అంతే కాదు కొందరు సినీ సెలబ్రెటీలు సైతం ఆమె వద్దకు వచ్చి భోజనం చేశారు. ఇంతకీ ఆమె ఎందుకు ఫేమస్ అయ్యారు? ఆమె వ్యాపారంలో ఉన్న ట్రిక్ ఏంటీ?

అందరిలాగే ఆమె కూడా చిన్న పాటి వ్యాపారన్ని ప్రారంభించి జీవితాన్ని నడిపించుకోవాలని అనుకున్నారు. అయితే అందరికంటేభిన్నంగా ఆలోచించారు. తక్కువ ధరతో ఎక్కువ ఐటమ్స్ ఉన్న భోజనాన్ని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఆమె పనితీరుకు రాని ప్రశంసలు అంటూ లేవు. అంతేకాకుండా సామాన్యులకు కడుపునిండా రుచికరమైన భోజనాన్ని అందిస్తూ పలువురి మనసులను గెలుచుకున్న ఆమె పేరు సాయకుమారి. ఇటీవల సాయికుమారి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడకు చెందిన సాయికుమారి మొదట్లో మిషన్ పై బట్టలు కుట్టేవారు. అయితే ఆమె భర్తకు ఫుడ్ బిజినెస్ చేయడం అంటే ఇష్టం. అయితే లాక్ డౌన్ సమయంలో అనాథలకు ఆహారాన్ని అందించడానికి కొందరు ఆమెకు కాంట్రాక్టు ఇచ్చేవారు. ఆ తరువాత సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా పనిచేశారు. ఈ తరుణంలో ఆమె చేసిన వంటకు ఫిదా అయ్యారు. ఆ తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్న సాయికుమారి హైదరాబాద్ లోని ఆర్బిటాల్ ఎదురుగా చిన్న కొట్టు పెట్టుకున్నారు.

అందరిలాగే వ్యాపారాన్ని ప్రారంభించిన సాయికుమారి.. డబ్బు సందపాదనే ధ్యేయంగా కాకుండా కడుపునిండా భోజనం పెట్టాలని ఆలోచించారు. ఈక్రమంలో రూ.60 లకే ప్లేట్ భోజనంలో కనీసం 10 కంటే ఎక్కువ రకాల ఐటమ్స్ వేస్తారు. ఇక నాన్ వెజ్ భోజనం కావాలంటే బగారా రైస్, తో పాటు నాన్ వెజ్ గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ప్రై, భోటీ కర్రీ ఇలా పలు రకాల పదార్థాలు ఆమె వద్ద లభిస్తాయి. వీటిలో కొన్నింటిని వేసి రూ.80 వరకు తీసుకుంటారు. ఇలా తక్కువ ధరకే ఎక్కువ పదార్థాలతో కూడిన భోజనం అందిస్తున్న సాయి కుమారి వద్ద ఇటీవల కొందరు సినీ నటులు సైతం వచ్చి భోజనం చేయడం విశేషం.