Sand Chai: గిన్నె ఛాయ్ గురించి తెలుసు.. కుండ టీ గురించి తెలుసు.. కానీ ఈ ఇసుక ఛాయ్ ఏంటి?

టీ కావాలంటే ఒకప్పుడు కట్టెల పొయ్యిపై కాసేవారు. ఆ తరువాత గ్యాస్ స్టౌపై తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏవీ అక్కర్లేకుండా వేడి వేడి టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ కాచడానికి ఇసుక ఉంటే చాలు అని ఓ వ్యక్తి అంటున్నాడు.

Written By: Neelambaram, Updated On : January 22, 2024 4:58 pm

Sand Chai

Follow us on

Sand Chai: సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. కొన్ని అద్భుతాలు మైబైల్ ద్వారా ఇంట్లో ఉండి చూడగలుగుతున్నాం. చేతిలో ఉన్న మొబైల్ లో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఎక్కడ ఏం జరిగినా చూడగలుగుతున్నాం. ఈ క్రమంలో కొన్ని డిపరెంట్ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఒక పాత్రలో పాలు పోసి, టీ పౌడర్, చక్కెర వేసి టీ చేసేవాళ్లు. ఆ తరువాత ఆరోగ్యానికి మంచిదని ఒక పెద్ద కుండలో వేడి వేడి టీ అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇసుకతో కూడా ఛాయ్ చేస్తున్నారంటే నమ్ముతారా?

టీ కావాలంటే ఒకప్పుడు కట్టెల పొయ్యిపై కాసేవారు. ఆ తరువాత గ్యాస్ స్టౌపై తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏవీ అక్కర్లేకుండా వేడి వేడి టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ కాచడానికి ఇసుక ఉంటే చాలు అని ఓ వ్యక్తి అంటున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఇసుక ఆధారంగా టీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణ టీ లాగే ఇది కూడా వేడి వేడిగా ఉండడంతో అందరూ షాక్ తింటున్నారు.

ఈ టీ తయారు చేయడానికి ఒక డ్రమ్ములో ఇసుక ను ఉంచారు. దానిని ఎండలో పెట్టారు. ఆ తరువాత ఒక పాత్రలో టీ పౌడర్, పాలు, చక్కెర కలిపిన మిశ్రమాన్ని ఒక పొడుగాటి పాత్రలో పోశారు. ఈ పాత్రను ఇసుక మధ్యలో పెట్టి అటూ ఇటూ కాస్త తిప్పారు. దీంతో నార్మాల్ గా ఉన్న ఆ పాత్ర ఒక్కసారిగా వేడి అయి టీ మరిగిపోయింది. అలా మధ్య మధ్యలో తీస్తూ మళ్లీ ఇసుకలో అటూ ఇటూ తిప్పారు. ఇలా కావాల్సినంతసేపు దీనిని వేడి చేయడం వల్ల రుచికరమైన టీ తయారవుతుంది.

అయితే ఈ ఇసుక రాజస్థాన్ లోనిదని తెలుస్తోంది. ఎందుకంటే వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే ఉంటాయి. ఈ ఇసుకలో ఉన్న వేడితో టీ ని కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పడానికే ఓ యువకుడు ఇలా చేశాడని అంటున్నారు. ఏదీ ఏమైనా ఎడారిలో ఉన్నప్పుడు టీ ఇలా కూడా తయారు చేసుకోవచ్చు.. అని తెలియడంతో షాక్ అవుతున్నారు.