Homeఎంటర్టైన్మెంట్Ram Charan Special Wishes : శంకర్ కు చరణ్ స్పెషల్ విషెస్...

Ram Charan Special Wishes : శంకర్ కు చరణ్ స్పెషల్ విషెస్ !

నేడు విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ (Director Shankar) పుట్టినరోజు. సోషల్ మీడియాలో దర్శకుడు శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సినీ అభిమానులు ట్విట్టర్‌ ని హోరెత్తిస్తున్నారు. ఐతే, మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ కూడా తన దర్శకుడికి పుట్టినరోజు విషెస్ చెబుతూ ఒక మెసేజ్ చేశాడు. చరణ్ ట్వీట్ చేస్తూ.. ‘శంకర్ సర్, మీకు ప్రత్యేక పుట్టినరోజు […]

Ram Charan Shankarనేడు విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ (Director Shankar) పుట్టినరోజు. సోషల్ మీడియాలో దర్శకుడు శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సినీ అభిమానులు ట్విట్టర్‌ ని హోరెత్తిస్తున్నారు. ఐతే, మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ కూడా తన దర్శకుడికి పుట్టినరోజు విషెస్ చెబుతూ ఒక మెసేజ్ చేశాడు.

చరణ్ ట్వీట్ చేస్తూ.. ‘శంకర్ సర్, మీకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను, త్వరలోనే నా 15వ సినిమా సెట్స్ లో మిమ్మల్ని దర్శకుడిగా చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చరణ్ మెసేజ్ చేశాడు. మరోపక్క ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు.

సౌత్ ఫిల్మ్ డైరెక్టర్స్ లోనే ప్రస్తుత ధ్రువతారగా వెలిగిపోతున్న దర్శకుల్లో ‘శంకర్’ కూడా ఒకరు. ఆ మాటకొస్తే.. రాజమౌళి తర్వాత శంకర్ దే ప్లేస్. ఇక శంకర్ సినీ ప్రస్థానాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే.. చాలా సాధారణంగా శంకర్ సినీ ప్రయాణం సాగింది. కానీ, దర్శకుడు అయ్యాక, కేవలం భారీ సినిమాల సృష్టికర్తగా ఆయన గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా సినిమా సినిమాకి తన దర్శకత్వ పరిధిని పెంచుకుంటూ.. గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్న మొట్టమొదటి డైరెక్టర్ గా శంకర్ కు అద్భుతమైన రికార్డు ఉంది. ఏది ఏమైనా శంకర్, తన సినీ కెరీర్ ను క్రమ శిక్షణతో అభివృద్ధి చేసుకోవడం విశేషం.

ఇక ‘రామ్ చరణ్ తో చేస్తోన్న భారీ బడ్జెట్ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు శంకర్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper