Ram Charan: రామ్ చరణ్ మొదటి సినిమాను ఆ స్టార్ డైరెక్టర్ చేయాల్సింది..కానీ చివరి నిమిషం లో ఎలా మిస్ అయిందంటే..?

స్టార్ హీరోల వారసులు కూడా మంచి నటులుగా మారి సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగడం ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం...ఇక మరి కొందరి వారసులకైతే సక్సెసులు లేకపోయిన బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల వాళ్ళను నెట్టుకొస్తున్నారు...

Written By: Gopi, Updated On : August 2, 2024 9:01 am

Ram Charan

Follow us on

Ram Charan: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందిన నటులు వాళ్ల తరం తర్వాత వాళ్ల కొడుకులను సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తారు. తద్వారా వారసులకు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేయడానికి మొదటి నుంచి ప్రీ ప్లాన్డ్ గా ప్రణాళికలను రూపొందిస్తారు…అందువల్లే వాళ్ళు నటనకు సంబంధించిన శిక్షణను తీసుకొని సినిమా రంగంలోకి అడుగు పెడతారు. ఇక అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ గా మారి ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు…ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి తన కొడుకు అయిన రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్త లు తీసుకున్నారు. ఇక ఆయనకు యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించి అలాగే గుర్రపు స్వారీలు నేర్పించి, డాన్సులు, ఫైట్లకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చే విధంగా అతన్ని ట్రైన్ చేసి అప్పుడు తనను సినిమా ఇండస్ట్రీలోకి దింపారు. ఇక మొదటగా రామ్ చరణ్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ‘చిరుత ‘ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన మొదటి సినిమాతోనే అద్భుతమైన డ్యాన్సులు, భారీ ఫైట్లను చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మెగా అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు…ఇక రామ్ చరణ్ ను మొదట ఒక క్లాస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చిరంజీవి అనుకున్నాడట.

Also Read: బాలీవుడ్ ఆ విషయం మర్చిపోయింది… హిందీ సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్

అందులో భాగంగానే ఆయన తేజ డైరెక్షన్ లో రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయించాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడట. కానీ తన సన్నిహితులు చెప్పిన కొన్ని మాటల ద్వారా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూరి జగన్నాథ్ చేతుల మీదుగా రామ్ చరణ్ ను లాంచ్ చేశారు… నిజానికి చిరంజీవి రామ్ చరణ్ మొదటి సినిమాను పూరి తో చేయించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే అప్పటికే పూరి పోకిరి, దేశముదురు లాంటి రెండు సూపర్ సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఒక స్టార్ హీరో కొడుకు సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే.

మరి ఆ స్థాయి అంచనాలను అందుకోవాలంటే దానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయితేనే సరిగ్గా సరిపోతారనే ఉద్దేశ్యంతో చిరంజీవి పూరి జగన్నాధ్ ని రంగంలోకి దింపాడు… ఇక తేజ కూడా కొత్త హీరోలను పరిచయం చేయడంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ అప్పుడు ఆయన సక్సెస్ లు లేక సతమతమవుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో వారసుడి ఎంట్రీ ఇప్పించడం అనేది కరెక్ట్ కాదు. అందుకే చిరంజీవి చరణ్ ను పూరి జగన్నాధ్ చేతిలో పెట్టి చాలా ఉత్తమమైన పని చేశాడంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే రామ్ చరణ్ మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోగా, రెండో సినిమాగా వచ్చిన ‘మగధీర’ మూవీతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. అలా రామ్ చరణ్ సాధించిన ఆ ఘనతను ఇప్పటివరకు ఏ హీరో కూడా సాధించలేదు. ఇకమీదట కూడా సాధ్యం కానీ రేంజ్ లో చరణ్ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను సాధించి చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు…ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి రెడీ అవుతున్నాడు…

Also Read: హీరో దుల్కర్ సల్మాన్ భార్యను ఎప్పుడైనా చూశారా? హీరోయిన్స్ సరిపోరు!