https://oktelugu.com/

Dulquer Salmaan: హీరో దుల్కర్ సల్మాన్ భార్యను ఎప్పుడైనా చూశారా? హీరోయిన్స్ సరిపోరు!

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆయనకు ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీ గురించి ఆయన ఫ్యాన్స్ కి పెద్దగా తెలియదు. ఆయన మమ్ముట్టి కుమారుడు అని మాత్రమే తెలుసు. అయితే దుల్కర్ సల్మాన్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆయన భార్య చాలా అందంగా ఉంటారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 1, 2024 / 01:44 PM IST

    Dulquer Salmaan

    Follow us on

    Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా పాపులర్ హీరో. మహానటి చిత్రంతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రంలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో అలరించాడు. దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో నటనకు కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవడం విశేషం. సీతారామం మూవీతో దుల్కర్ కి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం అద్భుతమైన ఎమోషనల్ లవ్ డ్రామా.

    Also Read: రవితేజ వదులుకున్న ఈ సినిమా ఆ యంగ్ హీరో కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారిందా..?

    దుల్కర్-మృణాల్ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై బాగా పండింది. రష్మిక మందాన మరో హీరోయిన్ రోల్ చేసింది. సీతారామం చిత్రానికి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. కాగా దుల్కర్ సల్మాన్ వ్యక్తిగత విషయాలపై అభిమానులకు పెద్దగా అవగాహన లేదు. ఆయన భార్య, పిల్లల వంటివి ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ భార్యను చూసి జనాలు వావ్ అంటున్నారు.

    Dulquer Salmaan

    దుల్కర్ సల్మాన్ భార్య పేరు అమల్ సుఫియా. వృత్తిరీత్యా ఆమె ఆర్కిటెక్ట్. అమల్ సుఫియా ని దుల్కర్ సల్మాన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమల్ సుఫియా – దుల్కర్ సల్మాన్ ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారు. చాలా కాలం వీరి ప్రేమకథ నడిచింది.

    తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. 2011 లో వీరి వివాహం జరిగింది. 2017 లో ఈ దంపతులకు మరియం అనే ఆడ బిడ్డ జన్మించింది. కాగా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, అమల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమల్ చాలా అందంగా ఉంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    దుల్కర్ మలయాళ నటుడు అయినప్పటికీ ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ ఉండటం విశేషం. వైవిధ్యమైన కథలు ఎంచుకుని సినిమాలు చేస్తూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి దుల్కర్ సల్మాన్ ఫోకస్ మొత్తం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఉంది. తెలుగులో వరుస సినిమాలు సైన్ చేస్తున్నాడు. అట్లూరి వెంకీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అలాగే ఆకాశంలో ఒక తార అనే సినిమాకు సైన్ చేసాడు. పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ,హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరో. డెబ్భై ఏళ్ల వయసు దాటినా కూడా మమ్ముట్టి వరుస చిత్రాలు చేస్తూ అభిమాని అలరిస్తున్నారు. దుల్కర్ విషయంలో మమ్ముట్టి భయపడ్డాడట. నేను ఇంత పెద్ద స్టార్. నాకొడుక్కి నటన రాకపోతే ఎగతాళి చేస్తారేమో అని భయపడ్డారట. కానీ దుల్కర్ అందరు మెచ్చిన నటుడు అయ్యాడు.

    Also Read: నాకు నా భర్త రాజ్ తరుణ్ కావాలన్న లావణ్య.. రాజ్ తరుణ్ రియాక్షన్ వైరల్…