https://oktelugu.com/

Allu Arjun : బాలీవుడ్ ఆ విషయం మర్చిపోయింది… హిందీ సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ బాలీవుడ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ బయటపెట్టాడు దర్శకుడు నిఖిల్ అద్వానీ. ఈ మేరకు నిఖిల్ అద్వానీ మాట్లాడారు. బాలీవుడ్ వాళ్ళు ఒక కీలకమైన విషయం మర్చిపోయారట. అందుకే వారు సక్సెస్ కావడం లేదని పరోక్షంగా అన్నట్లు అల్లు అర్జున్ మాటలను బట్టి అర్థం అవుతుంది. ఇంతకీ అల్లు అర్జున్ ఏమన్నాడో చూద్దాం...

Written By:
  • S Reddy
  • , Updated On : August 1, 2024 / 05:50 PM IST
    Follow us on

    Allu Arjun : బాలీవుడ్ ని టాలీవుడ్ ఎప్పుడో దాటేసింది. మన స్టార్స్ చిత్రాల బడ్జెట్ వందల కోట్లలో ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ తో సినిమా అంటే రూ. 500 కోట్లకు పైమాటే. ప్రభాస్ రెమ్యూనరేషన్ కే రూ. 150 కోట్లు కేటాయించాలి. మహేష్ బాబు-రాజమౌళి మూవీ బడ్జెట్ రూ. 800 కోట్లు అని సమాచారం. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సైతం రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగింది.

    మార్కెట్ ని బట్టే ఒక చిత్ర బడ్జెట్ ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ చిత్రాలకు వంద కోట్ల వసూళ్లు అందరి ద్రాక్ష. ఇక వంద కోట్లతో సినిమా తీయడం అంటే కలే. బాహుబలి తర్వాత ఆ సీన్ మారింది. టాక్ తో సంబంధం లేకుండా తెలుగు హీరోల చిత్రాలు అవలీలగా రెండు వందల కోట్ల వసూళ్లు దాటేస్తున్నాయి. ఈ పరిస్థితి బాలీవుడ్ లో లేదు. హిందీ చిత్రాల మార్కెట్ పరిధి పెద్దది. నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు.

    అయినప్పటికీ హిందీ హీరోల చిత్రాలు వంద కోట్లు వసూలు చేసేందుకు ముక్కి మూలుగుతున్నాయి. ఒకప్పుడు వరుస హిట్స్ తో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్షయ్ కుమార్, అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ చతికిలపడ్డారు. దశాబ్దానికి పైగా స్ట్రగుల్ అని షారుఖ్ ఖాన్ 2023లో కమ్ బ్యాక్ అయ్యాడు. పఠాన్, జవాన్ వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇక టైర్ టు హీరోల చిత్రాల వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.

    అదే సమయంలో సౌత్ సినిమాలు వసూళ్ళు కుమ్మేస్తున్నాయి. దీనికి కారణం… బాలీవుడ్ మేకర్స్ హీరోలను ఎలా చూపించాలో మర్చిపోయారని అల్లు అర్జున్ అన్నారట. సౌత్ చిత్రాలు నార్త్ లో సత్తా చాటుతుంటే, స్ట్రెయిట్ హిందీ చిత్రాలు మాత్రం ఆదరణకు నోచుకోకపోవడానికి కారణం ఇదే అని అల్లు అర్జున్ పరోక్షంగా అన్నాడట. ఈ విషయాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ చెప్పుకొచ్చాడు.

    సౌత్ ఇండియా డైరెక్టర్స్ మాస్ పల్స్ పట్టేస్తున్నారు. ఆడియన్స్ ఇష్టపడేలా హీరోలను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తున్నారు. నార్త్ డైరెక్టర్ ఈ విషయంలో విఫలం చెందుతున్నారని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ అన్నారని తెలుస్తుంది. కాగా పుష్ప పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. హీరో అల్లు అర్జున్ ఊరమాస్ డీగ్లామర్ రోల్ చేశాడు. నార్త్ ఆడియన్స్ విశేషంగా ఆదరించారు. పుష్ప తో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ రాబట్టాడు.

    పుష్ప 2పై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ రూ. 200 కోట్లకు అమ్మడుపోయినట్లు సమాచారం. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడింది. డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కానీ 6వ తేదీకి ప్రీఫోన్ అయినట్లు సమాచారం. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫజల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు.