https://oktelugu.com/

Raj Tarun Lavanya: న్యూస్ ఛానెల్ డిబెట్ లో పాల్గొన్న వ్యక్తి ని చెప్పుతో కొట్టిన రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు…

తెలుగులో ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ లు సాధించిన కొంత మంది హీరోలు మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డిస్ట్రబ్ అయిపోయితూ ఉంటారు... రీసెంట్ గా తన మాజీ లవర్ అయిన లావణ్య వచ్చి రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇక కొద్ది రోజుల నుంచి హాట్ టాపిగ్గా మారిన వీళ్ళ వ్యవహారం ఇప్పటికి ఒక కొలిక్కి అయితే రావడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : August 2, 2024 / 08:33 AM IST

    Raj Tarun Lavanya

    Follow us on

    Raj Tarun Lavanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజ్ తరుణ్… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ తన కెరియర్ ను చాలా బిజీగా కొనసాగిస్తున్నప్పటికీ తన పర్సనల్ విషయాల వల్ల ఆయన చాలా వరకు తన కెరియర్ ను నష్టపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది…ఇక ఇంతకుముందు ఆయన చేసిన కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాగే అప్పుడు ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకొని తన సినిమా కెరియర్ ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు. ఇక మధ్యలో కొన్ని ఆఫర్లు తగ్గినప్పటికి ఇప్పుడు వరుస సినిమాలను చేస్తుండటం వల్ల ఆయన మీద వచ్చిన వివాదాలు తొలిగిపోతున్నాయి అనుకుంటున్నా సమయంలో రీసెంట్ గా తన మాజీ లవర్ అయిన లావణ్య వచ్చి రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇక కొద్ది రోజుల నుంచి హాట్ టాపిగ్గా మారిన వీళ్ళ వ్యవహారం ఇప్పటికి ఒక కొలిక్కి అయితే రావడం లేదు. ఇక ఈ ప్రాసెస్ లోనే లావణ్య కి రాజ్ తరుణ్ కి మధ్య చాలా రకాల వివాదాలైతే తలెత్తుతున్నాయి. ఇక అందులో భాగంగానే రాజ్ తరుణ్ తను ఏ తప్పు చేయలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక దానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తానని క్లారిటీ ఇస్తున్నాడు. ఇక లావణ్య కూడా రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, మూడుసార్లు అబార్షన్ కూడా చేయించాడని తన వర్షన్ తను చెబుతుంది. ఇక ఇదిలా ఉంటే ఆమె చెప్పేదంతా అబద్ధం అంటూ రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయిన ఆర్ జే శేఖర్ భాషా కొన్ని న్యూస్ ఛానల్ లకు ఇంటర్వ్యూలను ఇస్తున్నాడు…

    Also Read: హీరో దుల్కర్ సల్మాన్ భార్యను ఎప్పుడైనా చూశారా? హీరోయిన్స్ సరిపోరు!

    అందులో భాగంగానే ఇప్పుడు లావణ్య, ఆర్ జే శేఖర్ భాషా ఇద్దరు ఒక న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్నారు. అందులో శేఖర్ భాషా చేసిన కొన్ని కామెంట్ల వల్ల కోపానికి వచ్చిన లావణ్య అక్కడే అతన్ని చెప్పుతో కొట్టడం సంచలనాన్ని సృష్టించింది… ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే న్యూస్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక మొత్తానికైతే లావణ్య రాజ్ తరుణ్ తనకి కావాలని అంటుంది. అలాగే రాజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని తనని ఎలాగైనా సరే నేను దక్కించుకుంటానని ఓపెన్ గా చెప్తూనే దానికోసం ఆమె చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది…

    ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కూడా ఆమె కరెక్ట్ పర్సన్ కాదని ఆమెకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నాడు. అలాగే ఆమెను ఉద్దేశించి మీడియా ముందు అరుస్తూ చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవు అంటూ కామెంట్లు చేశాడు. ఇక అలాగే రాజ్ తరుణ్ ఎలాగైనా సరే ఆమెను వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరికి జరుగుతున్న ఈ సంగ్రామంలో రీసెంట్ గా లావణ్య మళ్ళీ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. ఇక ఈ కేసు కు సంబంధించిన ముందస్తు బేయిలు కోసం రాజ్ తరుణ్ కోర్టు ను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది…

    రీసెంట్ గా ఆయన ‘తిరగబడరా సామి ‘ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ ఈ విషయానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక తను చెప్పాలనుకున్న ప్రతిదీ కోర్టు లోనే చెప్తానని ప్రూఫ్ లని కూడా అక్కడే సబ్మిట్ చేస్తానని చెప్పాడు. మరి వీళ్ళ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుంది అనేది తెలియాల్సి ఉంది…

    Also Read: బాలీవుడ్ ఆ విషయం మర్చిపోయింది… హిందీ సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్