Rakul Preet Singh: క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం అవకాశాల్లేక, ఫేడ్-అవుట్ అయ్యే స్థితిలో ఉంది. అందుకే, పారితోషికం అనే కాన్సెప్ట్ నుంచే సగర్వంగా బయటకొచ్చేసి.. రోజుకు ఇంత ఇవ్వండి అంటూ.. రకుల్ డెయిలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చింది. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్. అమ్మడులో ఇంకా ఆ గ్లామర్ స్కిల్స్ ఉన్నాయి. కానీ.. కొత్త టాలెంట్ దెబ్బకు రకుల్ స్టార్ డమ్ రోజురోజుకు తగ్గిపోతూ ఉంది. చాన్నాళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

పైగా, ఇప్పటివరకు చాలా సక్సెస్ లనే అందుకుంది. మరీ ముఖ్యంగా పెద్ద సినిమా ఆఫర్లు అన్నీ ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరకే వెళ్ళేవి. ఆమధ్య ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ లోపు రష్మిక, పూజా హెగ్డే, సాయి పల్లవి లాంటి భామలు ఫామ్ లోకి వచ్చారు. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ కి హీరోయిన్ అవకాశాలు ఆల్ మోస్ట్ అడుగంటాయి. దీంతో, పారితోషికం ఇచ్చి, ఛాన్స్ ఇచ్చే వాడే లేకుండా పోయాడు.
Also Read: Sreeleela: రాఘవేంద్రరావు రుణాన్ని తీర్చుకోలేదట.. కుర్ర భామ కొత్త కబుర్లు
అందుకే, రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ ఆలోచించకుండా కాల్షీట్ పేమెంట్ సెట్ చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో ఇక నుంచి హీరోయిన్ రోల్ అయినా, అతిధి పాత్ర అయినా, ఏదైనా కాల్షీట్ లెక్కన రకుల్ ప్రీత్ సింగ్ కు పారితోషికాన్ని సమర్పించుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకుంది. ప్రస్తుతం డెయిలీ పేమెంట్స్ లో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు అడుగుతుంది.

అది కూడా సినిమాని బట్టే ఉంటుంది. మొత్తానికి రకుల్ సంపాదన సంగతి పక్కనపెడితే.. లైమ్ లైట్ లో ఉండటమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ కి అద్భుతమైన నటన లేకపోయినా..హీరోయిన్ గా నిలదొక్కుకొని… ఎన్టీఆర్, మహేష్ బాబు, బన్నీ, చరణ్ లాంటి హీరోల అందరితో రొమాన్స్ చేసింది. పైగా నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్ అనే స్టార్ డమ్ ను సైతం అనుభవించింది.
కానీ.. కృతి శెట్టి, శ్రీ లీల లాంటి కొత్త భామలు వచ్చాక.. రకుల్ ప్రీత్ సింగ్ కి వచ్చే అరకొర ఆఫర్లు కూడా తగ్గాయి.
అందుకే.. రకుల్ ఇక పెద్దగా ఆలోచించడం లేదు. ఎంతోస్తే అంత అన్నట్టుగా బండి లాగించేస్తోంది. ఏమిటో పాపం.. తన అందాలతో అబ్బా అనిపించాల్సిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇలా ఛాన్స్ లు లేక విలవిల్లాడిపోతోంది. మొత్తానికి రకుల్ ను రోజుల లెక్క బుక్ చేసుకుంటున్నారు అన్నమాట.
Also Read:Goutham Raju: గౌతం రాజు కుటుబానికి పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి.. ఎంత సాయం చేశాడో తెలుసా?