హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ అందరికి షాక్ ఇవ్వడానికి కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా నటించబోతుందనే విషయం తెలిసిందే. కండోమ్ కంపెనీలో ఒక లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ? అందరూ ఆమెను ‘సెక్స్’క్యూటివ్ గా ట్రీట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ? అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. సినిమాలో రకుల్ పాత్ర పని ఏమిటంటే..
కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్, అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పనిని చేయబోతుంది రకుల్. బాలీవుడ్ లో రానున్న ఈ మూవీ పక్కా కామెడీ మూవీగా తెరకెక్కనుంది. ‘కండోమ్ టెస్టర్’ పాత్రని రకుల్ పోషించబోతుంది. ఐతే, ఈ పాత్రలో నటించే ఛాన్స్ రకుల్ కి లక్కీగా వచ్చింది. నిజానికి ఈ పాత్రను మొదట జాన్వీ కపూర్ తో లేదా అనన్య పాండేతో చేయించాలని అనుకున్నారు మేకర్స్.
కానీ వాళ్ళు ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత సారా అలీ ఖాన్ ను అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా నో చెప్పింది. మొత్తమ్మీద ఈ పాత్ర చేసేందుకు ఆ ముగ్గురూ ముందుకు రాకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ను ఆ పాత్ర కోసం తీసుకున్నారు. రకుల్ కి ఇప్పుడు ఎలాగూ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.
అందుకే హిందీలో వస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకుపోతుంది. ఏది ఏమైనా బోల్డ్ క్యారెక్టర్స్ ను పోషించడంలో రకుల్ ఆరితేరిపోయింది. ఇంతకీ ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఇక వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rakul preet singh to play condom tester in film refused by three heroines
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com