Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. పాపం...

Rakul Preet Singh: ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. పాపం ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Rakul Preet Singh: సినీ ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో కెరీర్ కానీ , స్టార్ హీరోయిన్ కెరీర్ కానీ , ఎప్పుడూ ఒకేలా ఉండదు. హిట్స్ ఉన్నంత కాలం వీళ్లకు ఉండే విలువ వేరు , హిట్స్ లేకపోతే మాత్రం చిన్న స్థాయి వాళ్ళు కూడా పట్టించుకోరు. ముఖ్యంగా హీరోయిన్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. అలాంటి హీరోయిన్స్ జాబితాలో ముందు వరుస లో ఉంది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). […]

Rakul Preet Singh: సినీ ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో కెరీర్ కానీ , స్టార్ హీరోయిన్ కెరీర్ కానీ , ఎప్పుడూ ఒకేలా ఉండదు. హిట్స్ ఉన్నంత కాలం వీళ్లకు ఉండే విలువ వేరు , హిట్స్ లేకపోతే మాత్రం చిన్న స్థాయి వాళ్ళు కూడా పట్టించుకోరు. ముఖ్యంగా హీరోయిన్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. అలాంటి హీరోయిన్స్ జాబితాలో ముందు వరుస లో ఉంది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. కుర్ర హీరోల దగ్గర నుండి , పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరికి రకుల్ ప్రీత్ సింగ్ కావాలి , ఆ స్థాయికి ఎదిగింది. రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా నేటి తరం బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో తప్ప అందరితోనూ నటించింది.

అయితే ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల, రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. చిన్నగా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసే స్థాయికి పడిపోయింది. కనీసం అలాంటి రోల్స్ కూడా ఆమెకు ఆఫర్ చేయడం లేదు. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో సూర్పనక్క లాంటి రాక్షసి పాత్రలో నటిస్తోంది. తనకంటే ఎంతో జూనియర్ అయినటువంటి సాయి పల్లవి అదే చిత్రం లో సీత క్యారెక్టర్ చేస్తుంటే , రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి పాత్ర పోషించడానికి ఒప్పుకుందంటే , ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈమెకు హిందీ లోనే అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా రోజుల నుండి ఆతృతగా ఎదురు చూస్తుందట.

కానీ అవకాశాలు మాత్రం ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఈమె చివరిసారిగా వెండితెర పై కనిపించిన తెలుగు చిత్రం ‘కొండపోలం’. ఈ చిత్రం తర్వాత ఆమె మరో తెలుగు సినిమాలో నటించలేదు. హిందీ ఇండస్ట్రీ కి షిఫ్ట్ అయిపోయిందని అంతా అనుకున్నారు కానీ , వాస్తవం ఏంటంటే ఆమెకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల, బాలీవుడ్ లోకి వెళ్లాల్సి వచ్చిందట. ఇప్పుడు ఈమెకు స్టార్ హీరోలు హీరోయిన్ రోల్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదే విధంగా మిడ్ రేంజ్ హీరోలు కూడా ఈమె వైపు చూడడం లేదు. ఎలా ఉండే రకుల్ ఎలా అయిపోయిందో మీరే చూడండి. ఈమె హీరోయిన్ రోల్స్ కోసమే చూడడం లేదు , ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా రెడీ గా ఉందట, కానీ దర్శక నిర్మాతలు మాత్రం రెడీ లేరట పాపం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper