Homeఎంటర్టైన్మెంట్రకుల్ స్పీడ్ పై డౌట్ పడుతున్న కాజల్ !

రకుల్ స్పీడ్ పై డౌట్ పడుతున్న కాజల్ !

క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొత్తానికి బాలీవుడ్ లో తెగ బిజీ అయిపోయింది. ఇంత స్పీడ్ గా హిందీలో వరుస సినిమాలు తెచ్చుకోవడం అంటే అది రకుల్ కి మాత్రమే సాధ్యమైంది అంటున్నారు. ఇలియానా, తాప్సి, కాజల్ లాంటి హీరోయిన్లు ఇంకా అక్కడ ఛాన్స్ లు అందుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కానీ రకుల్ చేతిలో మాత్రం ఇప్పటికే అర డజన్ చిత్రాలున్నాయి. ఒక విధంగా రకుల్ కూడా బాలీవుడ్ లో ఈ స్థాయి ఫామ్ […]

Rakulక్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొత్తానికి బాలీవుడ్ లో తెగ బిజీ అయిపోయింది. ఇంత స్పీడ్ గా హిందీలో వరుస సినిమాలు తెచ్చుకోవడం అంటే అది రకుల్ కి మాత్రమే సాధ్యమైంది అంటున్నారు. ఇలియానా, తాప్సి, కాజల్ లాంటి హీరోయిన్లు ఇంకా అక్కడ ఛాన్స్ లు అందుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కానీ రకుల్ చేతిలో మాత్రం ఇప్పటికే అర డజన్ చిత్రాలున్నాయి.

ఒక విధంగా రకుల్ కూడా బాలీవుడ్ లో ఈ స్థాయి ఫామ్ వస్తోందని ఊహించలేదు. అందుకే, సైలెంట్ టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేయడానికి తెగ కష్టపడుతూ ఉంది ఇన్నాళ్లు. కానీ ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా రకుల్ కెరీర్ బాలీవుడ్ లో మూడు పూవులు ఆరు కాయలు మాదిరిగా తయారైంది కాబట్టి, ఇదే ఆమె కెరీర్ లో గొప్ప దశ అనుకోవాలి.

ఎందుకంటే, ఇప్పటికే రకుల్ నటనలోకి వచ్చి 10 ఏళ్లు అయింది. అన్ని సంవత్సరాలుగా నటిస్తోన్నా ఎన్నడూ వరుసగా ఒకేసారి ఏడు సినిమాలు చేయలేదు. అది బాలీవుడ్ లో అంటే.. ఇక రకుల్ రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. పైగా రెమ్యునరేషన్ విషయంలో కూడా రకుల్ రెట్టింపు పుచ్చుకుంటుంది.

అసలు రకుల్ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా బాలీవుడ్ లో సినిమాల మీద సినిమాలు ఎలా లాక్కుంటోంది అంటూ కాజల్ అగర్వాల్ తెగ ఇదైపోతుందట. తనకు చేతకానిది ఆమె ఇంత సులభంగా ఎలా చేయగలుగుతుంది అనేదే కాజల్ డౌట్. ఇంతకీ రకుల్ వెనుక ఉన్నది ఎవరు ? తెలుగులో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. కానీ, బాలీవుడ్ లో ఆమె కెరీర్ అనూహ్యంగా ఎలా పుంజుకొంది ? రకుల్ కే తెలియాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper