
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 724 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 4,08,764 మంది చనిపోయారు. కరోనా నుంచి మరో 39,649 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,50,899 యాక్టివ్ కేసులు ఉన్నాయి.