https://oktelugu.com/

Pawan Kalyan Vs Rajinikanth: పవన్ కళ్యాణ్ తో పోటీ కి సై అంటున్న రజినీకాంత్…

Pawan Kalyan Vs Rajinikanth: మిగిలిన హీరోలు ఎవరికి లేనంత క్రేజ్ పవన్ కళ్యాణ్ కి ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : May 27, 2024 / 05:03 PM IST

    Pawan Kalyan vs Rajinikanth

    Follow us on

    Pawan Kalyan Vs Rajinikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్..ఇక ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయన్నైతే నమోదు చేస్తూన్నాయి. ఒకవేళ ఆయన సినిమా ఫ్లాప్ అయిన కూడా ఆ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక మిగిలిన హీరోలు ఎవరికి లేనంత క్రేజ్ పవన్ కళ్యాణ్ కి ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి. ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో(OG Movie) మరోసారి అసలైన కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని సుజీత్(Sujeeth) డైరెక్షన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ అనేది ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఎలక్షన్ల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ అయి శరవేగంగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా అక్టోబర్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక అక్టోబర్ లో ఇప్పటికే రజినీకాంత్ కూలీ సినిమాని(Coolie Movie) రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

    మరి పవన్ కళ్యాణ్ అక్టోబర్లోకి వస్తే రజనీకాంత్ తప్పుకుంటాడా లేదా అనే అంశాలు కూడా వెలువడుతున్నాయి. కానీ రజనీకాంత్ మాత్రం ఏ మాత్రం తప్పుకునే అవకాశాలు లేవు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. మరి వీళ్ళ సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

    Mahesh Babu Son: హీరోగా మహేష్ కొడుకు గౌతమ్.. అలా హింట్ ఇచ్చేశారా?

    Tollywood Star Actress: ముద్దు ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?