Citroen India: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ మన క్రికెటర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకొంది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ కార్ల కంపెనీ ‘సిట్రోయిన్’ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఆటో మొబైల్ రంగంలో తమకు ఆయన ఇమేజ్ కూడా కలిసి వస్తుందని సిట్రోయిన్ ఇండియా భావిస్తోంది. ఆయన మరెవరో కాదు.. ఇండియాకు వరల్డ్ కప్ సాధించిపెట్టిన మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni).
మాజీ కెప్టెన్ కు ఆటో మొబైల్ రంగం అంటే అమితమైన ప్రేమ. క్రికెట్ తర్వాత అతడు ఎక్కువగా ప్రేమించేది కార్లు, బైకులనే. వింటేజ్ బైకులు అన్నా, వింటేజ్ కార్లు అన్నా ధోనికి మక్కువ ఎక్కువ. రాంచీలోని అతని గ్యారేజీలో అనేక రకాల మోటార్ సైకిళ్లతో పాటు కార్లు ఉన్నాయి. రీసెంట్ గా ధోనితో బ్రాండింగ్ కలిసి వస్తుందని సిట్రోయిన్ నమ్మింది.
సిట్రోయిన్ ‘బసాల్ట్’(Basalt) పేరుతో కొత్త కూపే ఎస్‌యూవీని భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. దీన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ధోనితో అగ్రిమెంట్ చేసుకుంది. సిట్రోయెన్ కొత్త బ్రాండ్ ప్రచారాల్లో ధోని కనిపించనున్నాడు. ‘సిట్రోయెన్ కుటుంబంలోకి మహేంద్ర సింగ్ ధోనీని స్వాగతించడం సంతోషంగా ఉందని సిట్రోయెన్ ఇండియా డైరెక్టర్ శిశిర్ మిశ్రా’(Shishir Mishra) అన్నారు.
తమ కార్లను విస్తరించేందుకు ఆటోమోబైల్ రంగంపై ధోనీకి ఉన్న ఇంట్రస్ట్ కలిసి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అలాగే దేశంలో అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన ధోనితో మా సంస్థ అనుబంధం భారత మార్కెట్‌లోని కస్టమర్లకు మరింత నమ్మకాన్ని కల్పించేందుకు దోహదం చేస్తుందని’ ఆయన చెప్పారు. ధోని మాస్ క్రేజ్ మా బ్రాండ్‌కు సరిగ్గా సరిపోతుందని ఆయన అన్నారు. ధోనితో కలిసి సిట్రోయిన్ భారత్ లో సుస్థిర మార్కెట్‌తో పాటు కస్టమర్లకు మంచి సేవలను అందిస్తామని వెల్లడించారు.
ఫ్రెంచ్ కంపెనీ అయిన సిట్రోయెన్ భారతీయ మార్కెట్‌లో ప్రస్తుతం 4 మోడళ్లను సేల్ చేస్తోంది. ఇందులో సిట్రోయిన్ సీ-3, ఈసీ-3, సీ-3 ఎయిర్ క్రాస్, సీ-5 ఎయిర్ క్రాస్. రీసెంట్ గా సంస్థ ఈ బ్రాండ్ కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్లపై రూ. 4 వేల నుంచి రూ .17 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్ ఫుట్ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా ధర పెంచుతున్నట్లు మాతృ సంస్థ స్టెలాంటిస్ తెలిపింది.
సిట్రోయెన్ బసాల్ట్ సీ3, సీ3 ఎయిర్‌క్రాస్‌లోని ఫీచర్లను కలిగి ఉంటుంది. సీ-సిరీస్ కార్లకు భిన్నంగా తమదైన ముద్ర వేసేందుకు ఈ ఎస్‌యూవీ కూపే సిద్ధంగా ఉంది. భారత్‌తో పాటు దక్షిణ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు. తక్కువ ధరలోనే మంచి వాహనాలను అందించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
బసాల్డ్ 1.2-లీటర్ 3 సిలిండర్ల టర్బోఛార్జ్డ్‌ఇంజిన్‌తో పనిచేయనుంది. 5,500 rpm వద్ద 108 bhp గరిష్ట శక్తి, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌లో 1,750-2,500 rpm వద్ద 205 nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌లో 1,750 rpm వద్ద 190 nm టార్క్‌ను జనరేట్ చేయగలదు.
ఈ ఎస్‌యూవీ 2024 ద్వితీయార్థంలో దేశంలో విడుదయ్యే అవకాశం ఉంది. సిట్రోయెన్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ధోనీ అన్నారు. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో రూపొందించిన ఈ కారు ఇండియన్స్ కు నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్థిరమైన కారు మార్కెట్‌లో సిట్రోయిన్ తన నిబద్ధతను చాటుతుందని చెప్పారు.
Car Millage: మైలేజ్ ఎక్కువగా రావాలంటే ఈ టిప్స్ తప్పక పాటించండి..
Petrol Price Today: స్థిరంగా పెట్రోల్ ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?