Kanguva Movie: కోలీవుడ్ లో(Kollywood) తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు సూర్య(Suriya).. ఇప్పుడు తనదైన రీతిలో ఒక భారీ ఎక్స్పరిమెంటల్ సినిమా అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించారు. ఇక ఈ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే తెలుగు తమిళం లో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న సూర్య పాన్ ఇండియా మొత్తంలో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆయన కనక ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించినట్లైతే ఆయన పేరు పాన్ ఇండియాలో మారుమ్రోగుతుందనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు దీపావళి కి ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ముందు కొన్ని ఛాలెంజ్ లు అయితే ఉన్నాయి. అది ఏంటి అంటే ఇప్పటి వరకు గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ గా పాన్ ఇండియాలో వస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి.
మరి ఈ సినిమా వాటిని బీట్ చేసి మంచి గుర్తింపు ను సంపాదించుకుంటుందా? గ్రాఫిక్స్ మిగతా సినిమాలతో పోల్చుకుంటే అద్భుతంగా ఉంటుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటారని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఆయన ఆ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం నిలబడుతుందా లేదా అనేది తెలియాలి.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో పదివేల మందితో ఒక భారీ ఫైట్ ను కూడా షూట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ ఫైటే ఈ సినిమాలో హైలైట్ గా నిలవబోతుందట…ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ని అందుకుంటే సూర్య మార్కెట్ మరింతగా పెరిగి ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…