Tollywood Star Actress: సినీ ఇండస్ట్రీ(Film Industry) లో చిన్నతనంలో ఎంట్రీ ఇవ్వడం కామన్. ఊహ తెలియని వయసులో కెమెరా ముందు వచ్చి ఆ తరువాత స్టార్ హీరో, హీరోయిన్లు అయిన వారు ఎందరో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారని చెప్పలేం. అయతే ఇటీవల స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఓ భామకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో అలరిస్తోంది. ఆమె నటించిన ఓ మూవీ కూడా త్వరలో రాబోతుంది. ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా?
డీజే టిల్లు (DJ Tillu) సినిమాను ఎవరూ మరిచిపోరు. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పటికీ ఓటీటీ ద్వారా కొందరు వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరో జొన్నలగడ్డ సిద్ధు చేసిన హంగామా హంతా ఇంతా కాదు. అయితే హీరోకు తగ్గట్టుగా తగ్గేదేలే అన్నట్లుగా నటించింది నేహా శెట్టి (Neha Shetty). డీజే టిల్లు (DJ Tillu) మూవీ ద్వారా నేహా కు స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లోఅవకాశాలు తెచ్చుకుంది.
నేహా శెట్టి (Neha Shetty) డీజే టిల్లు కంటే ముందే కొన్ని సినిమాల్లో నటించింది. వీటిలో గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఉన్నాయి. ఈ సినిమాల్లో సైడ్ పాత్రలో కనిపించిన నేహా శెట్టి (Neha Shetty) కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లు (DJ Tillu) తరువాత ఆమె రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్ ఆఫ్ గోదావరి (Gang Of Godavari)లో నటిస్తోంది. ఈ మూవీ మే 31న రిలీజ్ కాబోతుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండీగా ఉంటుంది నేహా. లేటేస్టుగా ఆమె చైల్డ్ హుడ్ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ముద్దులొలికే పాపాయి అన్నట్లుగా కనిపిస్తుంది. భవిష్యత్ లో తప్పకుండా స్టార్ అవుతాననే ఉద్దేశంతో తన చూపులు ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నేహా శెట్టి (Neha Shetty) నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీలో నటనతో మెప్పిస్తుందని కొందరు అంటున్నారు. చూద్దాం. ఆమె ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చూపిస్తుందో..