https://oktelugu.com/

Virat Kohli: చేసింది 31 పరుగులే ఐనా.. CSK పై విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Virat Kohli ఐపీఎల్లో(IPL) విరాట్ కోహ్లీకి(Virat Kohli) ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండడానికి ప్రధాన కారణం.. అతడి ఆట తీరే. దూకుడుకు.. వేగానికి.. ఎదురుదాడికి అతడు పర్యాయపదం.

Written By: , Updated On : March 29, 2025 / 09:06 AM IST
Virat Kohli (12)

Virat Kohli (12)

Follow us on

Virat Kohli: అందువల్లే బెంగళూరు (RCB) జట్టు విరాట్ కోహ్లీని చాలా సంవత్సరాలుగా అంటిపెట్టుకొని ఉంటున్నది. అతడిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. కప్ నెగ్గిపోయినప్పటికీ.. దాదాపు 17 సంవత్సరాల పాటు నిరీక్షించినప్పటికీ విరాట్ కోహ్లీని లక్కీ చాంప్ గా బెంగళూరు(RCB) జట్టు భావిస్తోంది.. విరాట్ కోహ్లీకి జట్టులో ఎప్పటికప్పుడు సముచితస్థానం కల్పిస్తోంది. ఇటీవల డూ ప్లె సిస్ ను వదులుకున్నప్పుడు కెప్టెన్ గా ఎవరిని నియమించాలనే అంశాన్ని కూడా విరాట్ కోహ్లీతో బెంగళూరు జట్టు యాజమాన్యం చర్చించింది. విరాట్ కోహ్లీ సూచన మేరకు రజత్ పాటిదార్ ను నియమించింది. అందుకే రజత్(Rajat Patidar) ఆధ్వర్యంలో బెంగళూరు అగ్రస్థానంలో నిలుస్తుందని విరాట్ పేర్కొన్నాడు. ఇక విరాట్ ఈ సీజన్లోనూ తన బ్యాట్ ద్వారా మెరుపులు మెరిపిస్తున్నాడు. చెన్నై(Chennai super kings) జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 31 పరుగులే చేసినప్పటికీ.. స్ఫూర్తిదాయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కఠినమైన చెన్నై పిచ్ పై అద్భుతంగా బ్యాటింగ్ చేయలేకపోయినప్పటికీ.. తన వంతు పాత్రను పోషించాడు.

Also Read: 30 బంతుల్లో 31.. కోహ్లీపై పై నెట్టింట విమర్శలు!

సరికొత్త రికార్డు సృష్టించాడు

ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టుపై బెంగళూరు విజయం సాధించింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత చెన్నై మైదానంలో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించడం విశేషం. ఇక విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో భారీగా పరుగులు చేయలేకపోయినప్పటికీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. 33 ఇన్నింగ్స్ లలో 1084 పరుగులు చేసిన అతడు శిఖర్ ధావన్ (1057) ను అధిగమించాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తర్వాత స్థానాలలో రోహిత్ శర్మ (896), దినేష్ కార్తీక్ (727), డేవిడ్ వార్నర్ (696) కొనసాగుతున్నారు.. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 30 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 31 పరుగులు చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. టి20లలో టెస్ట్ తరహా ఇన్నింగ్స్ ఆడుతున్నాడని విరాట్ కోహ్లీపై నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే వారికి విరాట్ అభిమానులు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు..” చెన్నై మైదానంలో పిచ్ అత్యంత కఠినమైనది. ఇది బౌలర్లకు సహకరిస్తుంది. బంతులు వేగంగా దూసుకు వస్తున్నాయి. అయినప్పటికీ వాటిని తట్టుకుంటూ విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఉన్నంతలో మెరుగైన పరుగులు చేశాడు. విరాట్ పై విమర్శలు చేస్తున్నవారికి ఒక్కసారి ఆ పిచ్ పై ఆడితే తెలుస్తుంది. విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు అందరికీ తెలుసు. కొత్తగా ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అతడు బెంగళూరు జట్టుకు దొరికిన వజ్రాయుధం. కఠినమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అతనికి అలవాటని”విరాట్ అభిమానులు సోషల్ మీడియాలో నెటిజన్లు వస్తున్న విమర్శలకు బదులుగా వ్యాఖ్యానిస్తున్నారు.