Rajinikanth : ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలందరూ వరుస సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక రజనీకాంత్ లాంటి నటుడు 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ తగ్గకుండా భారీ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తనను చాలా గొప్ప గా పరిచయం చేశాయి. ఇక తమిళ్ సినిమాలన్ని తెలుగులో డబ్ అవ్వడం వల్ల ఆయనకు తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. అందుకే తమిళ్ కంటే కూడా అతనికి తెలుగులో చాలా వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో కూలీ(Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ భారీగా పెరగబోతుంది అంటూ తన అభిమానులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న రజనీకాంత్ తన పూర్వపు రోజులను మరోసారి గుర్తు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రజినీకాంత్ ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read : రజినీకాంత్ సిల్క్ స్మిత లో మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి..?
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? తద్వారా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ను చాలా వైల్డ్ గా చూపించడానికి లోకేష్ కనకరాజు సిద్దమయ్యారట.
ఇప్పటివరకు ఆయన చేసిన షూటింగ్ మొత్తాన్ని కనక గమనించినట్లయితే ప్రతి సీన్ లో కూడా రజనీకాంత్ చాలా హైలైట్ గా నిలువబోతున్నాడట… మరి దాన్ని టార్గెట్ గా చేసుకొని లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా రజినీకాంత్ ని గత పది సంవత్సరాలలో ఎవ్వరు చూపించని విధంగా చూపించబోతున్నాను అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.
ఇక ఇంతకుముందు విక్రమ్ సినిమాతో కమలహాసన్ ను చాలా వైల్డ్ గా చూపించి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్ ను కూడా అదే రేంజ్ లో చూపించి మరోసారి భారీ సక్సెస్ ను సాధించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఏదేమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆ గుర్తింపును కాపాడుకుంటూ ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read : రజినీకాంత్ స్టార్ డమ్ ను బీట్ చేయలేకపోయిన కమల్ హాసన్…కారణం ఏంటంటే..?