Rajinikanth Kamal Haasan Multistarrer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ లకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళ సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం తో వాళ్లకు తెలుగులో కూడా వాళ్లకు విపరీతమైన మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ఉన్న స్టార్ హీరోలతో పాటు పోటీ పడే రేంజ్ లో వాళ్ళు మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు అంటే మామూలు విషయం కాదు. అలాంటి స్టార్ హీరోలిద్దరూ కలిసి నటిస్తే చూడాలని తమిళ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. గతంలో వాళ్ళు కలిసి నటించినప్పటికి వాళ్లకు అప్పుడు ఇంత స్టార్ స్టేటస్ అయితే లేదు. కాబట్టి అప్పుడు మల్టీ స్టారర్ సినిమాగా చేసిన కూడా అది ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకర్షించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు చేసే సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన అటెన్షన్ ను క్రియేట్ చేసుకుంటుంది…ఇక వీళ్లిద్దరు ఓకే ఫ్రేమ్ లో కనిపించడం ప్రేక్షకులందరికి ఒక కన్నుల పండుగగా మారబోతుంది. నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ కాంబో ని చూడాలని చాలామంది అనుకున్నారు. ఎట్టకేలకు వాళ్ళ కోరికైతే నెరవేరబోతుంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గా వెలుగొందుతున్న చిరంజీవి బాలయ్య కలిసి నటించబోతున్నారనే వార్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తున్నాయి. కానీ అవి ఇప్పటి వరకు కార్యరూపమైతే దాల్చడం లేదు.
వాళ్లతో సినిమాలు చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు దొరకడం లేదా? లేదంటే వీళ్లిద్దరు కలిసి సినిమా చేసే ఇంట్రెస్ట్ లేక వదిలేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు కలిసి నటిస్తే చూడడానికి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది…
వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అంటూ అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు వీళ్ళిద్దరు కలిసి నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…